మెన్స్ట్రువల్ కప్పుల గురించి మీకు కూడా ఈ డౌట్లు ఉన్నాయా?

First Published | Oct 6, 2023, 2:52 PM IST

ప్యాడ్లు, టాంపోన్ల కంటే మెన్స్ట్రువల్ కప్పులే చాలా మంచివి. వీటివల్ల ఎలాంటి సమస్యలూ రావు. అయితే పీరియడ్స్ మాదిరిగానే మెన్స్ట్రువల్ కప్పుల గురించి కూడా ఎన్నో అపోహలను నమ్మేవారున్నారు. దీనివల్లే చాలా మంది ఆడవారు వీటిని ఉపయోగించడానికి భయపడతారు.
 

పీరియడ్స్ ఒక సాధారణ ప్రక్రియ. అయితే పీరియడ్స్ వల్ల కొంతమందికి  ఎలాంటి సమస్యలు రావు. కానీ మరికొంతమంది మహిళలకు మాత్రం విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిర్లు, వెన్నునొప్పి, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు తరచుగా ప్యాడ్స్ మార్చడం, లీకేజీలు కూడా ఈ సమస్యలను మరింత పెంచుతాయి. అయితే ప్యాడ్స్ కంటే మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తరచుగా మార్చాల్సిన అవసరం లేదు. 
 

menstrual cup

మెన్స్ట్రువల్ కప్ అనేది మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో తయారైన చిన్న సౌకర్యవంతమైన కప్పు. దీనిని మీరు మీ యోని లోపల ఉంచుతారు. ఈ కప్పును ప్యాడ్స్ మాదిరిగా నాలుగైదు గంటలకు మార్చాల్సిన అవసరం లేదు. వీటిని 8-10 గంటల పాటు ఉపయోగించొచ్చు. ఈ కప్పుకున్న ప్రత్యేకత ఏంటంటే.. దీనిని కడికి మళ్లీ ఉపయోగించొచ్చు. వీటిని ప్యాడ్లు లేదా టాంపోన్ల మాదిరిగా తరచుగా మార్చాల్సిన అవసరం లేదు. అయితే ఉపయోగించే ముందు వీటిని క్లీన్ గా ఉంచడం, వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే దీనికి సంబంధించిన కొన్నిసందేహాలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


అపోహ 1: మెన్స్ట్రువల్ కప్పుల వాడకం వల్ల హైమెన్ విచ్చన్నమవుతుందా? 

వాస్తవం: కన్యత్వం అంటే మీరు ఎవరితోనైనా శృంగారంలో పాల్గొన్నారా లేదా అని అర్థం. అయితే కన్యత్వానికి, రుతుస్రావానికి అస్సలు సంబంధమే లేదు. కానీ మీరు ఈ కప్పును ఉపయోగిస్తే హైమెన్ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. హైమెన్ ను విచ్ఛిన్నమైనంత మాత్రాన్ని మీరు కన్యత్వాన్ని  కోల్పోరు. ఈ హైమన్ పొర సెక్స్ లో పాల్గొంటేనే కాదు గేమ్స్, కొన్ని పనుల వల్ల కూడా చిరిగిపోతుంది. 
 

అపోహ 2: మెన్స్ట్రువల్ కప్ యోనిని సాగదీస్తుందా?

వాస్తవం:  ఈ కప్పులు యోనిని అస్సలు సాగదీయవు. మీరు సరైన సైజు కప్పును ఉపయోగిస్తే. ఈ కప్పు మీ యోని అడుగు భాగాన ఉంటుంది. ఈ కప్పు మృదువైనది. ఇది మీ యోనిని ఏమాత్రం సాగదీయదు.
 

అపోహ 3: ప్రతి ఒక్కరికీ ఒకే పరిమాణంలో మెన్స్ట్రువల్ కప్ ఉంటుంది?

వాస్తవం: ఇది కూడా మన అపోహే. అయితే ఈ కప్పులు వేర్వేరు పరిమాణంలో ఉంటాయి. చిన్న, మధ్య, పెద్ద అంటూ వివిధ సైజుల్లో ఉంటాయి. మొదట్లో చిన్న సైజు కప్పులనే ఉపయోగించండి. ఒక నెలలో మీ ఖచ్చితమైన పరిమాణం గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. అయినప్పటికీ నార్మల్ డెలివరీ అయిన మహిళలు పెద్ద సైజు కప్పులను ఉపయోగించాల్సి ఉంటుంది.
 

అపోహ 4: మెన్స్ట్రువల్ కప్పులతో రాత్రిళ్లు నిద్రపోకూడదా? 

వాస్తవం- మెన్స్ట్రువల్ కప్పులు ధరించి నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదు. కానీ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే లీకేజీలు అయ్యే అవకాశం ఉంది.  కానీ చాలా తక్కువ. రక్తం కప్పులోనే ఉంటుంది. ఆ తర్వాత మీరు కప్పును తీసేసి ఖాళీ చేయొచ్చు.

click me!