పీరియడ్స్ టైం లో ఆడవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకూడదు

First Published | May 13, 2024, 11:30 AM IST

పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కడుపు నొప్పి, అధిక రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్యలు రాకూడదంటే ఆడవాళ్లు ఏం చేయకూడదంటే? 

periods

ఆడవాళ్లకు పీరియడ్స్ ప్రతి నెలా వచ్చే ఒక సహజ ప్రక్రియ. ఈ సమయంలో ఆడవాళ్లు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.లేకపోతే తలనొప్పి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హెవీ బ్లీడింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆడవాళ్లకు ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో? తెలియకపోవడం వల్ల పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ సమయంలో ఆడవాళ్లు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


మరిన్ని పెయిన్ కిల్లర్స్

పీరియడ్స్ నొప్పిని తట్టుకోలేక చాలా మంది ఆడవారు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ అమెరికా ప్రకారం.. ఈ మందులను ఎక్కువగా వేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే గుండెపోటు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. 
 

Latest Videos


మరిన్ని వ్యాయామాలు

వర్కౌట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కానీ మీరు పీరియడ్స్ లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అది రుతుచక్రం, పీరియడ్ ప్రవాహంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు చురుకుగా ఉండటానికి పీరియడ్స్ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేసినా సరిపోతుంది. 

ప్యాడ్ లను మార్చకోకపోవడం

పీరియడ్స్ సమయంలో ఎప్పటికప్పుడు ప్యాడ్లను మార్చడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మంపై దురద, దద్దుర్లు కలిగించడమే కాకుండా ప్యాడ్ లో జన్మించిన బ్యాక్టీరియా కారణంగా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కూడా సంభవిస్తుంది. అందుకే ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి ప్యాడ్ లను మారుస్తూ ఉండాలి. 

నీటి కొరత

పీరియడ్స్ సమయంలో శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. ఈ సమయంలో డీహైడ్రేషన్ వల్ల రక్తప్రసరణ దెబ్బతింటుంది. అలాగే అపానవాయువు సమస్య కూడా వస్తుంది. అందుకే ఈ సమయంలో నీళ్లను పుష్కలంగా తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా తీసుకోవాలి.

click me!