అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే... అందుకోసం బ్యూటీ పార్లర్ ల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు... అలా అని మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు కూడా వాడాల్సిన అవసరం కూడా లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన క్రీములకు బదులు... ఇంట్లోనే చాక్లెట్ మాస్క్ వేసుకోవడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు. అది కూడా మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
Chocolate Face mask
ఈ చాక్లెట్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..? దానిని ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం...
ముందుగా.. పావు కప్పు డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల హెవీ క్రీమ్ కలపాలి. అందులో కొద్దిగా తేనె కలపాలి. అంుదలో కొంచెం నిమ్మరసం కూడా జత చేయాలి.
ఇప్పుుడు... ఈ పదార్థాలన్నింటినీ మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. దీనికన్నా ముందు.. ముఖాన్ని నీటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల... మీ ముఖం తాజాగా మెరుస్తూ ఉంటుంది. ఒకసారి తయారు చేసుకున్న చాక్లెట్ మాస్క్ ని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు ఉపయోగించవచ్చు. తరచూ చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా తయారౌతుంది.