అందమైన జుట్టు కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా, నల్లగా నిగనిగలాడుతూ కనపడాలనే కోరుకుంటారు.వయసు రీత్యా జుట్టు తెల్లపడటం, ఊడటం జరిగినా చాలా మంది బాధపడుతూ ఉంటారు. దానిని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు.అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ, సెలబ్రెటీలు ముఖ్యంగా చాలా మంది హీరోయిన్ల జుట్టు మాత్రం చాలా సిల్కీగా, నల్లగా నిగనిగలాడుతూ, అందంగా కనపడుతూ ఉంటుంది.వాళ్లంటే ఖరీదైన నూనెలు, షాంపూలు వాడతారు కాబట్టి అలా ఉంటాయి అనుకుంటే పొరపాటే. చాలా మంది సెలబ్రెటీలు తమ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు హోం రెమిడీలే ప్రయత్నిస్తారని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.మరి, వారి హెయిర్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా...