40 ఏళ్లు దాటకముందే ముఖంపై ముడతలా..? ఇలా తరిమి కొట్టండి..!

First Published | Jul 31, 2024, 2:32 PM IST

ఈ రెండు కూరగాయలు.. రెగ్యులర్ గా తినడం వల్ల.. మీ ముఖంపై ముడతలు తగ్గి..యవ్వనంగా కనిపిస్తారు.
 


వయసు పెరుగుతున్నా అందంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది అనే అందరూ కోరుకుంటారు. కానీ.. మనం  ఎన్ని క్రీములు వాడినా కూడా  40ఏళ్లు దాటాయి అంటే.. ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అయితే.. ఆ ముడతలను మనం ఫుడ్ తో కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా..? అది కూడా .. చాలా సింపుల్ గా మనకు మార్కెట్లో లభించే  కూరగాయలతో  ఈ ముడతలను తరిమికొట్టేయవచ్చు.  ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...
 


చాలా మంది పెద్దగా తినడానికి ఇష్టపడని కూరగాయల్లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు ముందుంటాయి. కానీ... ఈ రెండు కూరగాయలే.. మన అందాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి అంటే మీరు నమ్ముతారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ రెండు కూరగాయలు.. రెగ్యులర్ గా తినడం వల్ల.. మీ ముఖంపై ముడతలు తగ్గి..యవ్వనంగా కనిపిస్తారు.


క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్.. ఈ రెండింటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు.. హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలోనూ.. వివిధ రకాల చర్మ సమస్యల నుంచి రక్షించడంలోనూ ఇవి కీలకంగా పని చేస్తాయి.

చాలా మంది చర్మ సంరక్షణ కోసం గ్లూటాతియోన్ అనే సప్లిమెంట్స్ ని వాడుతూ ఉ:టారు. కానీ... సప్లిమెంట్స్ తో పనిలేకుండా.. అది ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లో పుష్కలంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల మనకు సహజంగా ఎల్-గ్లుటాతియోన్ 30 శాతం పెరుగుతుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి. 

అంతేకాదు ఈ కూరగాయలలో చర్మ ఆరోగ్యానికి అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.  వీటిలో  లుటీన్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది పొడి చర్మం సమస్యను తగ్గించడంతో పాటు.. ముఖం పై  ముడుతలు రాకుండా కాపాడుతుంది. వచ్చిన వాటిని తగ్గిపోయేలా కూడా చేస్తుంది.

సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడే సల్ఫోరాఫేన్ కూడా ఈ కూరగాయల్లో ఉంటుంది.  చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ఇక.. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ని మనం చాలా రూపాల్లో ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీకు రిజల్ట్ కనపడుతుంది. 

Latest Videos

click me!