మీరు హీల్స్ కొనాలి అనుకుంటే.. ఆరోజు సాయంత్రం కానీ, రాత్రిపూట కానీ షాపింగ్ కి వెళ్లాలి. అదేంటి అని మీరు ఆశ్చర్యపోయినా అదే నిజం.ఇది మీకు అసాధారణంగా అనిపించవచ్చు, కానీ మీ పాదాలు అన్ని రోజువారీ కార్యకలాపాల నుండి అలసిపోయి, వాపుకు గురయ్యే అవకాశం ఉంది. ఉదయం పూట కొనుగోలు చేస్తే.. అప్పుడు సరిపోయినట్లే ఉంటాయి.. రాత్రికి ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. అలా కాకుండా.. రాత్రి పూట సెలక్ట్ చేసుకుంటే.. ఈ సమస్య ఉండదు.