తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతుంది. ఒక్కసారి గర్భం దాల్చిన తర్వాత.. బిడ్డ పుట్టేవరకు మహిళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా.. బిడ్డ ప్రాణానికే ప్రమాదం. అందుకే.. అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ.. సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా.. కొందరు మహిళలు మాత్రం పొరపాటున తినకూడని ఫుడ్స్ తింటూ ఉంటారు. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. బొప్పాయి..బొప్పాయి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. గర్భిణీలకు మాత్రం అది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పచ్చిబొప్పాయిలో ఉండే లాటాక్స్, పాలవంటి పదార్థం యూటేరియన్ పై ప్రభావం చూపుతుంది. పచ్చిబొప్పాయి తినడం వల్ల వెజినా లేదా లాబర్ మరియు అబార్షన్ కు దారితీస్తుంది.
2. కాఫీ..నమ్మసక్యంగా లేకున్నా.. గర్భిణీలు కాఫీ ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా తీసుకోవడం కడుపులో బిడ్డ ఎదుగుదలకు మంచిది కాదు. ఎక్కువగా కెఫెన్ తీసుకుంటే.. కడుపులో బిడ్డ బరువు తక్కువగా పుడతారు.
3.పచ్చి కోడిగుడ్డు..గర్భిణీలు పచ్చి కోడిగుడ్డు తీసుకోవడం కూడా మంచిది కాదు. పచ్చి గుడ్డు స్లో పాయిజన్ లాంటిది. కేవలం గుడ్డు మాత్రమే కాదు.. ఉడకపెట్టని ఏ ఫుడ్ తీసుకోకపోవడం ఉత్తమం.
4.పైనాపిల్..గర్భం దాల్చిన మొదటి నెలలో పైనాపిల్ తీసుకోకూడదు. పైనాపిల్ ముక్కలు,జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అబార్షన్ అవ్వడం.. కడపులో బిడ్డ చనిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది.
5.లివర్..నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లివర్, మటన్ లివర్ తినడం పట్ల ఆసక్తి ఉంటుంది. అయితే.. గర్భిణీలకు మాత్రం ఈ ఫుడ్ కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తినడం వల్ల కడుపులో బిడ్డకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా అయితే.. కొద్దిగా తీసుకోవచ్చు.
6.పాయిశ్చరైజ్ చేయని పాలు..పాయిశ్చరైజ్ చేయని పాలు తాగడం కూడా మంచిది కాదు. పాయిశ్చరైజ్ చేయని పాలు, చీజ్, పన్నీర్ కూడా తినడం మంచిది కాదు. వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదలకు మంచిది కాదు.
7.మునగ..మునగకాయలో పొటాషియం, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ.. అది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు.
8.నువ్వులు..గర్భిణీ స్త్రీలు నువ్వులు తినడం అంత మంచిదేమీ కాదు. మరీ ముఖ్యంగా నువ్వులు, తేనె కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది అబార్షన్ కావడానికి కారణమౌతుంది.
9.మొలకలు వచ్చిన బంగాళదుంపబంగాళ దుంప తినొచ్చు. కానీ.. మొలకలు వచ్చిన బంగాళ దుంపలు మాత్రం అస్సలు తినకూడదు.
10. అలోవెరా..అలోవెరా కూడా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. దీనికి దూరంగా ఉండటం మంచిది.