పీరియడ్స్ సమయంలో మహిళలు చేయకూడని పనులివే..!

First Published | Dec 31, 2020, 12:19 PM IST

తెలిసీ తెలియక కొందరు మహిళలు ఈ పీరిడయ్స్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అసలు పీరియడ్స్ సమయంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..
 

పీరియడ్స్ ప్రతినెలా వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అమ్మాయిలకు నెలసరి వస్తే.. ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఆ మూడు రోజులు కూర్చోపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. పీరియడ్స్ శరీరంలో మార్పులో భాగంగా వచ్చే చిన్న విషయం అని అందరికీ అర్థమయ్యింది.
అందుకే.. ఎక్కడో తప్ప.. దాదాపు పీరియడ్స్ గురించి పెద్దగా చేసి చూసేవాళ్లు ఎవరూ లేరు. అయితే.. తెలిసీ తెలియక కొందరు మహిళలు ఈ పీరిడయ్స్ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అసలు పీరియడ్స్ సమయంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..

1. పీరియడ్స్ లో స్విమ్మింగ్ చేయకూడదు. ఎందుకంటే స్విమ్మింగ్ చేసే నీటిలో.. ఆ నీరు త్వరగా పాడైపోకుండా కెమికల్స్ కలుపుతారు. దాని వల్ల జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2.నెలసరి లక్షణాలు ఒక వారం ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయి. ఆ సమయంలో మహిళలు ఎక్కువ అలసటతో, చిరాకుతో ఉంటారు, వ్యాయామ శాలకు వెళ్లటానికి చాలా కష్టం. ఈ సమయంలో మీరు కొంచెం నెమ్మదిగా మరియు తీవ్రమైన వ్యాయామం చేయకుండా, పైలేట్స్ లేదా రన్నింగ్ వంటి తక్కువ-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోవచ్చు.
3.కొందరికి నెలసరి సరిగ్గా ఒకే సమయానికి రాదు. అలాంటప్పుడు కంగారు పడకూడదు. ప్రతినెలా సరిగ్గా వచ్చి ఒక్క నెల తేడా వచ్చినంత మాత్రాన ఏమీకాదు.. పని ఒత్తిడి కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
4.పీరియడ్స్ రావడానికి ముందు వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. అలాంటప్పుడు కంగారు పడకూడదు. అది చాలా కామన్ విషయమని గుర్తుంచుకోవాలి.
5.నెలసరి సమయంలో కొన్ని వ్యాయామాలు చేయకూడదు. పొట్ట మీద ఒత్తిడి పడే ఏ వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే అందువల్ల ఎక్కువ రక్త స్రావం అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల మరింత అలసట, నీరసంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వీలైనంత వరకు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
6.నడక అనేది సున్నితమైన మరియు తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం. మీరు హార్డ్‌వర్క్ ఏమీ చేయకూడదనుకుంటే, నడక చాలా మంచిది. ఇది మీ మానసిక స్థితిని పెంపొందించడానికి సాయపడుతుంది. అదే విధంగా, మీరు కొన్ని కేలరీలను బర్న్ చేయగలరు. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిర్లు లేకపోతె పరుగు కోసం వెళ్ళవచ్చు.
7.నెలసరి సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి అధిక రక్త స్రావం అవుతూ ఉండుండి. అలంటి వారు డాక్టర్ ను అడిగి అడిగి తేలికపాటి వ్యాయామం లేదా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో నడిస్తే మంచిది.

Latest Videos

click me!