బంగారం బదులు డైమండ్స్ కొంటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

First Published Feb 16, 2021, 10:17 AM IST

చాలా మంది ఆభరణాలను ఇన్వెస్టిమెంట్ పర్పస్ ఉపయోగిస్తుంటారు. అయితే.. ఈ విషయంలో డైమెండ్స్ ఇన్వెస్టిమెంట్ కి పనికిరావని భావిస్తుంటారు. 

ఎన్ని ఆభరణాలు ఉన్నా.. మళ్లీ , మళ్లీ కొత్త డిజైన్ ఆభరణాలు కొనుక్కోవాలని మహిళలు ఆశపడుతుంటారు. మార్కెట్లోకి రకరకాల మోడల్స్ వస్తుండంతో.. వాటిపై మహిళలు మనసుపారేసుకుంటారు. అయితే.. ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా... డైమండ్స్ కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు.
undefined
ఈ సారి మీరు కూడా బంగారానికి బదులు డైమండ్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా..? అయితే.. డైమండ్స్ కొనేముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి వీటి విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాలను పోగొట్టుకొని తర్వాత వాటిని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
డైమండ్స్ ఇన్వెస్టిమెంట్ కి పనికిరావా..?చాలా మంది ఆభరణాలను ఇన్వెస్టిమెంట్ పర్పస్ ఉపయోగిస్తుంటారు. అయితే.. ఈ విషయంలో డైమెండ్స్ ఇన్వెస్టిమెంట్ కి పనికిరావని భావిస్తుంటారు. ఈ విషయం ఎంత వరకు నిజమో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
undefined
‘బంగారంలా వజ్రాలు లాభదాయకమైన పెట్టుబడి కాదని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి ఇది నిజం కాదు. ఉదాహరణకు, 5-7 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన డైమండ్స్ ప్రస్తుతం వాటి ధర 50 నుంచి 70శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. . వజ్రాలతో తయారు చేసిన ప్రతి ఆభరణానికి మద్దతు ఉంది ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు హామీ, ప్రామాణికత ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. వాటి సహాయంతో.. మళ్లీ వాటిని అమ్మాలని అనుకున్నప్పుడు ఎలాంటి నష్టం ఉండదు’ అని నిపుణులు చెబుతున్నారు.
undefined
బంగారం మెరుపు తగ్గుతుందా..?వజ్రాలు కొన్న కొత్తల్లో ఉన్న మెరుపు.. తర్వాత ఉండదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే.. అందులో ఎలాంటి నిజం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పటికీ మెరుపు కోల్పోవు. అందుకే పూర్వ కాలంలో రాజులు వజ్రాలను ఎక్కువగా వినియోగించేవారు.
undefined
రీసేల్ చేయలేమా..?బంగారం మాదిరిగానే.. వజ్రాలను కూడా మనం రీ సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే.. వజ్రం కొనుగోలు చేసినప్పుడు మనకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం కచ్చితంగా జాగ్రత్త చేసుకోవాల్సిందే. అది ఉంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీ సేల్ చేసుకోవచ్చు.
undefined
డైమండ్ పగిలి పోదా?చాలా మంది డైమండ్స్ పగిలిపోవని అనుకుంటారు. డైమండ్ చాలా గట్టి పదార్థమే అయినప్పటికీ.. దానిని కూడా కొట్టాల్సిన విధంగా కొడితే కచ్చితంగా పగులుతుంది. కాబట్టి.. డైమండ్ జ్యూవెలరీ ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
undefined
మెరిసేవన్నీ డైమండ్స్ కావు..డైమండ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. డైమండ్స్ కి, అమెరికన్ డైమండ్స్ కి తేడా ఉంది. కొందరు వాటి మధ్య వ్యత్సాసం తెలీక అన్నీ డైమండ్స్ అని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
undefined
పెద్ద డైమండ్ ధర ఎక్కువ.. చిన్న డైమండ్ ధర తక్కువ ఉంటుందా..? ఇది కూడా నిజం కాదట. ఒక్కోసారి చిన్న డైమండ్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉటుందట. ఎందుకంటే దానిని అంత చిన్నగా కట్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి.. ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
undefined
click me!