మిస్ ఇండియా పోటీల్లో ఆటోవాలా కూతురు.. రన్నరప్ గా మాన్యా సింగ్

First Published | Feb 12, 2021, 10:44 AM IST

ఈ పోటీల్లో మానస విన్నర్ గా నిలవగా.. రన్నరప్ గా మాన్యా సింగ్ నిలిచింది. ఈ అమ్మాయి ఓ ఆటోవాలా కూతురు కావడం గమనార్హం.

మిస్ ఇండియా పోటీలనగానే అదో అందమైన ప్రపంచంగా కనపడుతుంది. ఆ పోటీల్లో పోటీ పడే అమ్మాయిలు కూడా మంచి హై క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వస్తారని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే ... ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చామనే విషయం అసలు మ్యాటరే కాదని నిరూపించింది మాన్యా సింగ్.
undefined
ఇటీవల మిస్ ఇండియా పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్ గా నిలిచింది. ఈ వార్త విని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గర్వంగా ఫీలయ్యారు. మన అమ్మాయి విన్నర్ గా నిలిచిందని సంబరపడ్డారు.
undefined

Latest Videos


కాగా.. ఈ పోటీల్లో మానస విన్నర్ గా నిలవగా.. రన్నరప్ గా మాన్యా సింగ్ నిలిచింది. ఈ అమ్మాయి ఓ ఆటోవాలా కూతురు కావడం గమనార్హం.
undefined
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాన్యాసింగ్.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.
undefined
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎంతగానో శ్రమించిన తర్వాత తనకు దక్కిన విజయం ఎంతో విలువైందని మాన్యా వ్యాఖ్యానించారు.
undefined
ఈ క్రమంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, అయితే ఇతరుల నుంచి ప్రేరణ పొంది ముందుకెళ్లానని పేర్కొంది. ‘నా రక్తం, చెమట, కన్నీళ్లు నా కలలను కొనసాగించే ధైర్యంగా కలిసిపోయాయి’ అని మాన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
undefined
యూపీలో కుషీనగర్‌కు చెందిన మాన్యాది నిరుపేద కుటుంబం. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదుర్కొంది. ఆహారం, నిద్ర లేకుండా రాత్రులు గడపడం.. కొన్ని రూపాయలు ఆదా చేయడానికి మైళ్లు దూరం నడవడం.. విలువైన పుస్తకాలు, బట్టల కోసం ఆరాటపడినా అదృష్టం తనకు కలిసి రాలేదు అని చెప్పింది.
undefined
ఇంట్లోని నగలు తాకట్టు పెట్టి పరీక్ష ఫీజు కట్టిన రోజులను మాన్యా గుర్తుచేసుకుంది. అన్ని సమస్యల పరిష్కారానికి విద్య బలమైన ఆయుధమని తాను బలంగా నమ్ముతానని తెలిపింది.
undefined
నా కలలను సాకారం చేసుకుని తల్లిదండ్రులు, సోదరుడికి మంచి జీవితం ఇచ్చి, తానేంటో ప్రపంచానికి నిరూపించడానికి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నానని మాన్య చెప్పడం విశేషం.
undefined
click me!