చీరకట్టుడులోనూ న్యూ స్టైల్... ఇరగదీసిన బ్యూటీలు..!

First Published Feb 15, 2021, 1:12 PM IST

చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బాలీవుడ్ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు. 

భారత సాంప్రదాయంలో మహిళలు చీరకట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఒకప్పుడు మహిళలు చీరలు తప్ప మరేదీ కట్టుకునేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది.. స్టైల్ మారింది.. అబ్బాయిలకు ఏ విషయంలోనూ అమ్మాయిలు తీసిపోవడం లేదు. మరి ఇలాంటి తరుణంలో పాతకాలం పద్దతులు ఫాలో అవ్వాలంటే ఎవరు మాత్రం ఫాలో అవుతారు.
undefined
అయితే... చీరకట్టులోనూ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చని ఈ తరం బ్యూటీలు నిరూపించారు. చీరలోనూ ఇంత ట్రెండీగా కనిపెంచవచ్చని ఈ బ్యూటీలు తమ లుక్స్ తో చూపించేశారు. మరి ఆ స్టైల్స్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..
undefined
1. ప్రీ డ్రేప్డ్ సారీ... స్టైలిష్ గా చీరను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వారికి ఈ చీర పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ప్రీ డ్రెప్డ్ సారీ ఇటీవల ధరించారు. లేత గులాబి రంగులో ఉన్న చీర ఆమెకు చాలా అందాన్ని తీసుకువచ్చింది. చీర అంచులు మొత్తం అందమైన పూసలతో అలంకరించారు. ఈ చీర కట్టుకుంటే.. ప్రత్యేకంగా మళ్లీ ఎలాంటి ఆభరణాలు ధరించాల్సిన అవసరం లేదు.
undefined
2.సీక్వెన్డ్ చీర అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ఇటీవల సీక్వెన్డ్ చీర ధరించారు. మనీష్ మల్హోత్రా ఈ చీరను ధరించారు. మ్యాచింగ్ బ్రాలెట్ జాకెట్టు చీరకు మరింత అందాన్ని తెచ్చింది. ఆమె చంకీ చెవిరింగులు మరియు మ్యాచింగ్ రింగ్‌తో జత చేసింది. ఏదైనా డెస్టినేషన్ వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్లేవాళ్లు.. ఇలాంటి చీరతో అదరగొట్టేయవచ్చు.
undefined
3.రఫ్ఫ్డ్ చీర మహేష్ బ్యూటీ కృతి సనన్ ఇటీవల రఫ్ఫ్డ్ చీర తో అదరగొట్టేసింది. కోల్డ్ షోల్డర్స్ బ్లౌజ్ తో అదే రంగు మ్యాచ్ చేసింది. అంతేకాకుండా చీరకు ముందుగా బెల్ట్ పెట్టి.. మరీ ట్రెండీ చేసింది. కృతి పచ్చ ఆకుపచ్చ చోకర్ నెక్లెస్, ఫిజ్జి గోబ్లెట్ నుండి కొల్హాపురిస్ మరియు సైడ్ పార్టెడ్ ఉంగరాల జుట్టుతో లుక్ పూర్తి చేసింది. ఏదైనా థీమ్ పార్టీకి వెళ్లాలి అనుకునేవారికి ఈ చీర చక్కగా నప్పుతుంది.
undefined
4.ప్యాంట్ సారీ.. ఈ చీర కట్టుకోవడం కూడా చాలా సులువు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి ఇటీవల ప్యాంట్ సారీ ధరించారు. చీర కట్టుకోవడానికి బద్ధకించేవారు.. ఇలాంటి చీర కట్టుకోవడం.. కట్టుకోవడం చాలా సులవు. హ్యాండిల్ చేయడం కూడా అంతే సులువు. చూడటానికి చాలా ఎలిగెంట్ గా ఉంటుంది.
undefined
click me!