నిపుణుల ప్రకారం.. తెల్ల జుట్టుకు మందార పువ్వు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంట్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ ను తయారుచేసి పెట్టుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. అలాగే దీన్ని డైట్ లో చేర్చుకుంటే చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉండదు.
మందార పువ్వు తెల్ల జుట్టు రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అసలు మందార పువ్వు మన జుట్టుకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? దీన్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తెల్ల జుట్టుకు మందార పువ్వు
మందార పువ్వు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టును పొడుగ్గా పెంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది జుట్టు తెల్లబడటాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.