పండగ వేళ అందంగా మెరిసేందుకు సింపుల్ చిట్కాలు..!

First Published Oct 31, 2023, 11:17 AM IST

బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. అప్పుడు, సహజంగానే అందంగా కనపడగలరు.
 

అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా పండగలు, పార్టీలు వంటి స్పెషల్ డేస్ లో అందరిలో కెల్లా స్పెషల్ గా కనిపించాలని అనుకుంటారు. అయితే, సడెన్ గా ఒక్కరోజులో మనకు మెరిసే అందం రాదు. కానీ, కొన్ని రోజుల ముందు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల , అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలోనే కర్వా చౌత్, దీపావళి వంటి పండగలు ఉన్నాయి. కాబట్టి, ఆ సమయంలో మనం అందంగా కనపడేందుకు, ఈ ట్రిక్స్ ఫాలో అయిపోండి.
 

1.అందంగా కనపడటానికి ఆ రోజు మేకప్ వేసుకుంటే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ, మన ముఖంపై మేకప్ ఉన్నా, లేకున్నా కూడా అందంగా కనిపించాలంటే మన చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలి. దాని కోసం ఎక్కువగా మంచి నీరు తాగుతూ ఉండాలి. నీరు పుష్కలంగా తాగడం వల్ల చర్మం హైడ్రెటెడ్ గా ఉంటుంది. ఇది కూడా ముఖానికి అందాన్ని తెస్తుంది.

2.పై పై పూతలతో వచ్చే అందం ఎప్పటికీ శాశ్వతం కాదు. కాబట్టి, అందాన్ని పెంచుకోవడానికి లోపలి నుంచి మొదల పెట్టాలి. అంటే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. అప్పుడు, సహజంగానే అందంగా కనపడగలరు.

3.ఈ పై రెండు సూత్రాలు ఫాలో అవుతూనే స్కిన్ ని కొంచెం, కొంచెంగా ప్యాంపర్ చేయాలి. దాని కోసం స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వాలి. క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. క్లెన్సింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పైన డెడ్ సెల్స్ తొలగిపోయి, యాక్టివ్ అవుతాయి.

4.చాలా మంది చలికాలంలో లేదంటే, బయటకు వెళ్లే సమయంలో మాత్రమే మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు. కానీ, కాలంతో, పనితో సంబంధం లేకుండా, ప్రతిరోజూ ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది, సహజంగా మీకు అందాన్ని తీసుకువస్తుంది

5.బయటకు వెళ్లే సమయంలోనే కాకుండా, ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ లోషన్ రాయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఎస్పీఎఫ్ 30 లోపు ఉండేలా చూసుకోవాలి. ఇది మీ హై పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. మీ పెరుగుతున్న వయసు తగ్గేలా చేస్తుంది.
 

Beauty

6.అందంగా కనిపించాలనే కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. దానికి తగినట్లు మనం ప్రయత్నం చేయాలి. దాని కోసం క్వాలిటీ నిద్ర చాలా అవసరం. మనకు సరిపడా నిద్ర లభించినప్పుడు కూడా అందంగా కనపడతారు.

7.ఒత్తిడి నియంత్రించాలి.. ఒత్తిడి ని మేనేజ్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే, దాని ప్రభావం కూడా మన ముఖంపై ఎక్కువగా పడుతుంది. కాబట్టి, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు.

8.వీటితో పాటు, అప్పుడప్పుడు ఫేస్ మాస్క్ లు కూడా ఉపయోగించాలి. సహజ ఉత్పత్తులతో తయారు చేసిన ఫేస్ షీట్ మాస్క్ లు లేదంటే, ఇంట్లోని ఉత్పత్తులతో ఫేషియల్స్ చేసుకోవడం వల్ల కూడా అందంగా మెరిసిపోవచ్చు.

click me!