Skin Care: ఎండాకాలంలో ఇవి తింటే, ముఖంపై మొటిమలు కూడా రావు..!

Published : May 07, 2025, 04:01 PM IST

వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే కేవలం బయట నుంచే కాకుండా లోపలినుంచి శరీరాన్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్ ని  మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా చర్మానికి ముఖ్యంగా ముఖానికి గ్లో తెచ్చి పెడుతుంది.

PREV
15
Skin Care: ఎండాకాలంలో ఇవి తింటే, ముఖంపై మొటిమలు కూడా రావు..!


ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, అధిక చెమట, నీరసం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని లోపలినుంచి చల్లబరచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. వాటిలో ముఖ్యమైనవి చల్లని గుణాలున్న గింజలు. ఈ గింజలు తినడం వల్ల శరీరానికి శాంతి కలిగడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి.

25

1. పొద్దు తిరుగుడు గింజలు (Sunflower Seeds)
పొద్దు తిరుగుడు గింజలు ఆయుర్వేదం ప్రకారం చల్లని స్వభావం కలిగినవి. ఇవి విటమిన్ E, మగ్నీషియం, సెలీనియం, ఫైటోన్యూట్రియెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రోజూ ఒక స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు  గింజలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్‌ తగ్గడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, వాపులు తగ్గుతాయి, మొటిమల సమస్య దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటం వల్ల ముఖం మీద కాంతి మెరుస్తుంది.

35

2. సబ్జా గింజలు (Sabja/Basil Seeds)
సబ్జా గింజలు వేసవిలో అత్యంత అవసరమైన గింజలు. ఇవి చల్లదనాన్ని కలిగించే విశేషతతో పాటు శక్తివంతమైన డిటాక్సిఫయర్లు. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. మొటిమలు వంటివి తగ్గిపోతాయి. ఇందులో ఉండే ఫైబర్ , ప్రోటీన్ శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంతో పాటు ఆకలిని నియంత్రించి బరువు నియంత్రణలో సహాయపడతాయి. హార్మోనల్ బ్యాలెన్స్‌ను సమతుల్యం చేస్తాయి. అయితే ఇవి అధికంగా తినకూడదు. ఒక్కసారి ఒక టీస్పూన్‌ చాలు.
 

45

3. సోంపు గింజలు (Fennel Seeds)
సోంపు అనేది ప్రతి ఇంట్లో ఉండే సాధారణ గింజలు. ఇది కేవలం వాసనకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సోంపు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకం, కడుపులో ఉబ్బరం తగ్గిపోతాయి. సోంపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. రోజూ భోజనానంతరం చిటికెడు సోంపు నమిలితే శరీరాన్ని చల్లబరచడంతో పాటు ముఖం మీద ప్రకాశం కూడా కనిపిస్తుంది. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.


 

55

వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే కేవలం బయట నుంచే కాకుండా లోపలినుంచి శరీరాన్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్ ని  మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా చర్మానికి ముఖ్యంగా ముఖానికి గ్లో తెచ్చి పెడుతుంది. అయితే ఇవన్నీ మితంగా, సరైన సమయంలో తీసుకుంటేనే ప్రయోజనకరం.

ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా, తేలికగా ఉంచడంలో సహాయపడతాయి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకునే చిన్న అడుగులు, మీ దీర్ఘకాలిక శ్రేయస్సుకు పెద్ద మార్గాలు తెరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories