ఇవి తింటే... ఐదు పదుల వయసులోనూ సూపర్ స్ట్రాంగ్ గా..!

First Published | Jun 20, 2024, 5:16 PM IST

నీరసం పెరుగుతుంది. శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక.. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే... ఈ వయసులోనూ మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. 
 

old couple


వయసు పెరిగే కొద్దీ.. మనం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కానీ.. చాలా మంది ఆహారం విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంక మాది ఏముంది.. అంతా అయిపోయింది.. వయసులో ఉన్నవారు మీరు తింటే సరిపోతుంది అని తమ పిల్లలకు చెబుతూ ఉంటారు. కానీ.. 50ఏళ్లు దాటిన తర్వాత.. చాలా రకాల ఆరోగ్య ససమ్యలు మొదలౌతాయి.

అంతేనా... నీరసం పెరుగుతుంది. శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక.. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే... ఈ వయసులోనూ మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. 


ప్రధానంగా వయసు పెరిగే కొద్దీ మధుమేహం, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, వీటిని నివారించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం , ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలు.. ఐదు పదులు దాటిన తర్వాత.. ఈ కింది ఫుడ్స్ ని తమ డైట్ లో తీసుకుంటే... 25ఏళ్ల పడుచులా చాలా స్ట్రాంగ్ గా తయారౌతారు. మరి.. ఎలాంటివి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం...


అవిసె గింజలు: ఈ గింజలు స్త్రీలకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో రక్త లోపం భర్తీ అవుతుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ,కొలెస్ట్రాల్‌కు చాలా మంచిది. అవిసె గింజలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా చర్మం , జుట్టును కూడా సంరక్షిస్తాయి.

sesame seeds

నువ్వులు: నువ్వులు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది వారి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది వారి ఎముకలను బలపరుస్తుంది . ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.


మెంతులు: 55 ఏళ్లు పైబడిన మహిళలు తమ రెగ్యులర్ డైట్‌లో మెంతికూరను చేర్చుకోవాలి. ఇది మీ ఇన్సులిన్ నిరోధకత , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే, ఇది చక్కెర శోషణను మందగించడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మెంతి గింజలను నీటిలో నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినొచ్చు. పెద్దగా పెరిగిన మెంతికూర కంటే.. చిన్న మొలకలా వచ్చిన మెంతికూర తినడం మంచిది. 

Latest Videos

click me!