మనలో ప్రతి ఒక్కరూ స్టైలిష్ గా, అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇందుకోసం ఎన్నో రకాల డ్రెస్సులను కూడా కొంటుంటారు. అయితే పెళ్లిళ్లప్పుడు మాత్రం ఎలాంటి చీరలు లేదా డ్రెస్సులను వేసుకోవాలో మాత్రం తోచరు. సంక్రాంతి తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది కాబట్టి పెళ్లల్లో ఎలా రెడీ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెడ్డింగ్ ఫంక్షన్ లో వేసుకోవడానికి లెహంగాలు కూడా సూట్ అవుతాయి. నిజానికి వీటిలో మీరు చాలా అందంగా కనిపిస్తారు. ఈ లెహంగాలు ఎన్నో డిజైన్లలో కూడా ఉంటాయి. కానీ వీటిలో మీరు మోడ్రన్ గా రెడీ అవ్వాలి. మీకు మోడ్రన్ లుక్ ఇవ్వడానికి సహాయపడే కొన్ని లెహంగా డిజైన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శాటిన్ ఫ్లోరల్ లెహంగా డిజైన్
మీరు బ్యూటిఫుల్, మినిమమ్ లుక్ పొందాలనుకుంటే ఈ రకమైన డిజైన్ లెహంగాను ప్రయత్నించొచ్చు. శాటిన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఈ లెహంగాలో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. మీరు ఈ రకమైన లెహంగాను మార్కెట్ లో సుమారు రూ .3,000 కు సులభంగా పొందొచ్చు. ఈ రకమైన లుక్ తో మీరు మెస్సీ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.
మెటాలిక్ డిజైన్ లెహంగా
ఈ రోజుల్లో ఏ లుక్ ఎంచుకోవాలన్నా కలర్ కాంబినేషన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మన స్కిన్ టోన్, లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిగణలోకి తీసుకోవాలి. కాగా మెటాలిక్ డిజైన్ లెహంగా కూడా వెడ్డింగ్ ఫంక్షన్ కు బాగా సరిపోతుంది. ఈ లెహంగాలో మీ లుక్ అదిరిపోతుంది. ఈ రకమైన లుక్ తో మీరు డైమండ్ ఆభరణాలను ధరించండి. మరింత అందంగా కనిపిస్తారు.
టర్టిల్ నెక్ లో స్టైలిష్ లెహంగా స్కర్ట్
చలికాలంలో ఈ తరహా లుక్ లో మీరు మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ రకమైన లుక్ కోసం ఏదైనా టర్టిల్ నెక్ టాప్ తో ఉన్న లెహంగాను ట్రై చేయండి. ఇది మీకు ఆధునిక, ఇండో-వెస్ట్రన్ లుక్ ను ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు ఈ రకమైన లుక్ తో ముత్యాల ఆభరణాలను ధరిస్తే మీ బ్యూటిఫుల్ గా కనిపిస్తారు.