వంటగది శుభ్రంగా, అందంగా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Feb 18, 2024, 10:47 AM IST

వంటగదిని మన ఇంట్లో ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన భాగంగా భావిస్తారు. అయితే వంట పొగ, నూనె, కూరగాయల చెత్త వల్ల వంటగది తొందరగా మురికిగా మారుతుంది. చాలా మంది ఆడవాళ్లకు వంటగదిని శుభ్రం చేయాలంటే చిరాకొస్తుంది. అలాగే దీన్నిక్లీన్ చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. ఫాస్ట్ గా, ఏ పద్దతిలో వంటింటిని క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వంటగదిని శుభ్రం చేయడం ఆడవాళ్లకు ఒక సవాలే. ఎందుకే నూనె మరకలు, పప్పు దినుసులు, కూరగాయలు మొదలైనవి వంటగదిలో ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. దీనికి తోడు కూరల మరకలు కూడా అక్కడక్కడ పడుతుంటాయి. అందుకే ఇంట్లోని అన్ని రూముల్లో  వంటగదే ఎక్కువ మురికిగా ఉంటుంది. వంటగదిని సరిగ్గా క్లీన్ చేయకపోతే దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే వంటగదిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అయితే చాలా సార్లు ఆడవాళ్లు వంటింటిని క్లీన్ చేసేటప్పుడు కొన్ని వస్తువులను శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. అందుకే వంటగదిని శుభ్రం చేసేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం పదండి.

సిలిండర్ పైప్, స్టవ్ ని నిర్లక్ష్యం చేయొద్దు

చాలాసార్లు ఆడవాళ్లు వంటగదిని తరచుగా క్లీన్ చేస్తుంటారు. కానీ కొన్ని ప్లేస్ లను శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. వీటిలో ఒకటి గ్యాస్ స్టవ్, దాని పైపులు. నిజానికి రోజూ వంట చేయడం వల్ల నూనె, కూరలు వీటిపై పడుతుంటాయి. వీటిని క్లీన్ చేయకపోతే అవి మరకలుగా మారుతాయి. అందుకే వంటింటిని శుభ్రం చేసేటప్పుడు వీటిని కూడా క్లీన్ చేయాలి. ఇందుకోసం వేడినీటిలో నిమ్మకాయ, కొంత డిటర్జెంట్ పౌడర్ కలిపి పైపును శుభ్రం చేసుకోవాలి.
 


kitchen cleaning tips

ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీలు 

వంటగదిలో వంట చేసేటప్పుడు వచ్చే పొగ చిమ్నీలకు బాగా అంటుకుంటుంది. అందుకే వంటగదిని క్లీన్ చేసేటప్పుడు వీటిని కూడా శుభ్రం చేయండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లో ఎక్కువ దుమ్ము పేరుకుపోతే అది సరిగ్గా పనిచేయదు. లేదా వంటగదిలోని వేడిని బయటకు పంపలేదు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దీని కోసం మీరు లిక్విడ్ సబ్బు, వెనిగర్ ను ఉపయోగించొచ్చు.
 

కిటికీలు, తలుపులను శుభ్రం చేయండి

ఆడవాళ్లు ఎక్కువగా వంటగది స్లాబ్, స్టవ్ చుట్టూ పడిన మురికినే క్లీన్ చేస్తారు. కానీ అక్కడ ఉన్న కిటికీలపై మాత్రం దృష్టి పెట్టరు. నిజానికి వంట చేసేటప్పుడు నూనె పొగ గోడలు, గాజు కిటికీలపై అతుక్కుపోతుంది. అందుకే వీటిని 3 నుంచి 4 రోజులకు ఖచ్చితంగా శుభ్రం చేయాలి. 
 

మిక్సర్లు, గ్రైండర్లు

వంటగదిని క్లీన్ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. కిచెన్ లో ఉండే ప్రతి వస్తువును క్లీన్ చేయాలి. వీటిలో మిక్సర్లు, గ్రైండర్లు, గ్రాస్టర్లు, టోస్టర్లు, శాండ్విచ్ తయుచేసేది, వాల్-మౌంటెడ్ పాత్రల స్టాండ్లు మొదలైనవి ఉన్నాయి. వీటిని అప్పుడప్పుడే వాడుతున్నప్పటికీ వంటగదిలో ఉంచడం వల్ల వీటన్నింటిపై కూడా మురికి పేరుకుపోతుంది. అందుకే వారంలో ఒకసారైనా వీటిని క్లీన్ చేస్తుండాలి. 

Latest Videos

click me!