ఆఫీసుకు వెళ్లే మహిళలకు.. ఈ డైట్ చాలా అవసరం..!

First Published | Feb 17, 2024, 2:25 PM IST

సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో పనితో పాటు, ఆఫీసు పని ఒత్తిడి తో ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే..  మంచి ఆహారం తీసుకోవాలి. 

ఈరోజుల్లో దాదాపు చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే.. ఇంటి పని, ఆఫీసు పని హడావిడిలో సరైన భోజనం తీసుకోరు. కనీస సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

working women

ఇంట్లో పనితో పాటు, ఆఫీసు పని ఒత్తిడి తో ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే..  మంచి ఆహారం తీసుకోవాలి. మరి.. వారం రోజులు ఏ రోజు ఎలాంటి డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం..


1.సోమవారం..
ఉదయం గ్రీక్ యోగర్ట్ తీసుకోండి, దానితో పాటు కొన్ని బాదం పప్పులను తినాలి.  ఇక లంచ్ లో కినోవా సలాడ్, అది కూడా అన్ని రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దీనితో పాటు గ్రిల్డ్ చికెన్ కూడా తీసుకుంటే ప్రోటీన్ కూడా అందుతుంది. ఇక డిన్నర్ లో  బేక్ చేసిన చేప, రోస్ట్ చేసిన స్వీట్ పొటాటో తింటే సరిపోతుంది.

2.మంగళవారం..
ఈరోజు ఉదయం అన్ని రకాల గ్రెయిన్స్ తో చేసిన టోస్ట్, అవకాడో, పోచ్డ్ ఎగ్ తీసుకోండి. లంచ్ లో వోల్ గ్రెయిన్ చపాతీ తో పప్పు తీసుకోవాలి. ఇక డిన్నర్ లో కొంచెం బ్రౌన్ రైస్ ఏవైనా కూరగయాలు తీసుకోవచ్చు.
 

Oatmeal

3.బుధవారం 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండేలా ఓట్ మీల్ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే శెనగలు కూడా స్నాక్స్ లో తీసుకోవచ్చు. లంచ్ లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే యోగర్ట్ , చపాతీ కూర తినాలి. ఇక డిన్నర్ లో లీన్ ప్రోటీన్, వోల్ గ్రెయిన్ చపాతీ, ఆకుకూరలు తీసుకుంటే సరిపోతుంది.

green smoothie

gree4.గురువారం
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పాలకూర, బననా, బాదంపాలు కలిపి స్మూతీ చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. లంచ్ లో రోటీతో పాటు... గ్రిల్డ్ చికెన్ తీసుకోవాలి. డిన్నర్ లో పాస్తా లాంటివి తీసుకోవచ్చ.

5.శుక్రవారం..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో క్రీమ్ లేని పాలల్లో సెరల్స్ వేసుకొని తినవచ్చు. దీంట్లోనే స్ట్రాబెర్రీలు జత చేసుకోవచ్చు. ఇక లంచ్ లో బ్రౌన్ రైస్, బీన్స్, కార్న్, అవకాడో లాంటివి తీసుకోవచ్చు. డిన్నర్ చాలా లైట్ గా ఉండేలా రోస్టెడ్ పొటటోలు తింటే సరిపోతుంది.

pan cake


6.శనివారం..
ఇక శనివారం వీకెండ్ కాబట్టి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్యాన్ కేకులు తినొచ్చు. వీటితో పాటు యోగర్ట్, బ్లూ బెర్రీలు కూడా తీసుకుంటే బెటర్. లంచ్ లో కినోవా, ఏదైనా గ్రిల్డ్ చికెన్, ఫిష్ లాంటివి తీసుకోవచ్చు. డిన్నర్ లో కూరగాయలతోపాటు.. బ్రౌన్ రైస్ తినొచ్చు,


7.ఆదివారం..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో స్క్రాంబుల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. దీనిలో పాలకూర, మష్రూమ్స్ లాాంటివి కలుపుకోవచ్చు. ఇక లంచ్ లో చపాతీ తోపాటు చికెన్, అన్ని రకాల కూరగయాలు ఉండేలా చూసుకోవాలి. డిన్నర్ లో బేక్డ్ చికెన్  కినోవాతో కలిపి తీసుకోవచ్చు. 

Latest Videos

click me!