రమ్యకృష్ణ కి పరిచయం అవసరం లేదు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాదిన కొనసాగుతున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సాగిన ఆమె.. బాహుబలి తర్వాత తల్లి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. పేరుకు తల్లి క్యారెక్టర్లు అయినా.. ఆమె చాలా హుందాగా, అందంగా తెరపై కనిపిస్తున్నారు. అసలు ఆమె వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనే సందేహం అందరికీ కలుగకమానదు.