ముఖానికి తేనెను ఎంతసేపు ఉంచాలి?
తేనెను ముఖానికి పెట్టడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలను పొందుతారు. కానీ దీన్ని ఎక్కువ సేపు మాత్రం ముఖానికి ఉంచకూడదు. ఒకవేళ మీరు ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ఇంతకంటే ఎక్కువ సేపు ఉంచితే లాభాలను కాదు నష్టాలను చవిచూస్తారు.
ముఖానికి తేనెను ఎలా పెట్టాలి?
తేనెతో మీరు లాభాలను పొందాలనుకుంటే మాత్రం.. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు మీ ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి. తేనెను ముఖానికి పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే?