వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంప - ఒకటి
కాఫీ పౌడర్ - ఒకటి
విటమిన్ ఇ క్యాప్సూల్ - ఒకటి
ఎలా తయారుచేయాలంటే?
ముందుగా బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్ని రసాన్ని వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపండి. అంతే మిశ్రమం రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని మీ కళ్ల చుట్టూ అప్లై చేసి 2 నిమిషాలు అప్లై చేసి సున్నితంగా కొంచెం మసాజ్ చేసి వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి.