రాత్రిపూట ఈ అలవాట్లు.. మిమ్మల్ని అందంగా మారుస్తాయి..!

First Published Dec 2, 2023, 1:46 PM IST

ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే, మెరిసిపోయే అందం మీ సొంతమౌతుంది. అవేంటో ఓసారి చూద్దాం..

అందంగా కనిపించాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? తమ వయసు పెరుగుతున్నా, వయసు కంటే తక్కువగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అయితే, అలా కనిపించాలి అంటే, దాని కోసం మనం కొన్ని పనులు  చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే, మెరిసిపోయే అందం మీ సొంతమౌతుంది. అవేంటో ఓసారి చూద్దాం..
 

1.పిల్లో కవర్..

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మనలో దాదాపు చాలా మంది పిల్లో కవర్స్ గా కాటన్ వి ఎంచుకుంటాం. కానీ, ఆ కాటన్ పిల్లో కవర్ కి బదులు సిల్క్ పిల్లో కవర్స్ ఎంచుకోవాలంట. సిల్క్ పిల్లో కవర్స్ వాడటం వల్ల జుట్టు తొందరగా పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ముఖం పై ముడతలు కూడా పడకుండా కాపాడుతుందట. మీకు నిజంగా అందంగా కనిపించాలి అంటే, వెంటనే మీ పిల్లో కవర్స్ ని మార్చేయండి.

2.క్లెన్సింగ్..
రాత్రి పడుకునే ముందు ముఖానికి క్రమం తప్పకుండా క్లెన్సింగ్ చేయాలి. అది కూడా హైడ్రేటింగ్ క్లెన్సర్ తీసుకోవాలి. ఉదయం పూట వేసుకునే మేకప్ ని ఉంటాం కాబట్టి, దానిని తొలగించడానికి కూడా ఈ క్లెన్సర్ ని ఉపయోగించాలి. హార్ష్ క్లెన్సర్స్ కాకుండా  సాఫ్ట్ వి ఎంచుకోవడం చాలా ముఖ్యం.

3.స్కిన్ కేర్ రొటీన్..
మీరు క్రమం తప్పకుండా నైట్ కేర్ రొటీన్ ని ఫాలో అవుతూ ఉండాలి. క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్ లను క్రమం తప్పకుండా రాత్రి పూట అప్లై చేస్తూ ఉండాలి. ఈ రకం స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వడం వల్ల  అందంగా కనిపించే అవకాశం ఉంటుంది.
 

4.అరోమా థెరపీ..

అరోమా థెరపీ చేయడం వల్ల కూడా మనం మన అందాన్ని పెంచుకోవచ్చు.  లావెండర్, చమేలీ ఆయిల్స్ ని ఉపయోగించడం వల్ల  మన మైండ్, బాడీ కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర, మంచి స్కిన్ కి కూడా ఉపయోగపడుతుంది.
 

5.స్క్రీన్ టైమ్..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫోన్లు, ల్యాప్ ట్యాప్, ట్యాబ్ లకు అతుక్కుపోతున్నారు. అవి లేకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. అవి కూడా మన అందాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి,  రాత్రిపూట పడుకునే ముందు  కాస్త స్క్రీన్ టైమ్ ని తగ్గించుకోవాలి. రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. దాని వల్ల మన అందం కూడా పెరుగుతుంది.
 

click me!