ఆడవాళ్ల నడుం సైజు ఎంతుంటే మంచిది?

First Published Nov 30, 2023, 3:07 PM IST

ఒకేదగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుం సైజు బాగా పెరిగిపోతుంది. నిజానికి నడుం సైజు పెరగడం అంత మంచివిషయమేమీ కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

అందంగా, నాజుగ్గా కనిపించాలని నడుమును సన్నగా ఉంచడానికి ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  నిజానికి నడుం అందానికే కాదు.. ఇది మీ ప్రస్తుత ఆరోగ్య స్థితి గురించి కూడా తెలియజేస్తుందని  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మాయో క్లినిక్ ప్రకారం.. మీ ఉదర ప్రాంతం చుట్టూ బాగా పేరుకుపోయే కొవ్వును విసెరల్ కొవ్వు అంటారు. ఈ కొవ్వు అంతర్గత అవయవాలను కూడా చుట్టుముడుతుంది. సబ్కటానియస్ కొవ్వు అంటే ఇది మన చర్మం కింద ఉండే కొవ్వు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. విసెరల్ కొవ్వు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Image: Getty Images

నడుము చుట్టుకొలతను ఎలా కొలవాలంటే? 

నడుము చుట్టుకొలత మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఎన్ఐహెచ్ ప్రకారం.. సాధారణంగా 35 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ చుట్టుకొలత మహిళలకు సాధారణ, ఆరోగ్యకరమైన నడుము పరిమాణంగా పరిగణించబడుతుంది. నడుము కొలత 35 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న మహిళలకు కొన్ని వ్యాధులు, ఆరోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. 
 

పెద్ద నడుము వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు 

మాయో క్లినిక్ ప్రకారం.. మహిళలకు ముఖ్యంగా వయస్సు పెరిగేకొద్దీ వీరి నడుము చుట్టూ విసెరల్ కొవ్వు బాగా పెరిగిపోతుంది. ఆడవారి శరీరాలు వయస్సుతో పాటుగా కండరాలను కోల్పోతారు.. అలాగే వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా తగ్గుతుంది. ఇది శరీరం కొవ్వును ప్రభావితం చేస్తుంది. అంటే వయసు పెరిగే కొద్ది ఆడవారి నడుము చుట్టూ కొవ్వు స్థాయి పెరుగుతుందన్న మాట.
 

జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ లో ప్రచురించిన 2015 కథనం ప్రకారం.. ఉదర కొవ్వు,  టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం మధ్యనున్న సంబంధాన్ని కనుగొంది. ప్రస్తుతం చాలా అధ్యయనాలు నడుము చుట్టుకొలత జీవక్రియ సిండ్రోమ్ కు దారితీస్తుందని వెల్లడిస్తున్నాయి. 

ఆరోగ్యకరమైన నడుము పరిమాణాన్ని సాధించాలంటే?

మాయో క్లినిక్ ప్రకారం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే విసెరల్ కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలను తినండి. నడుము సైజు తగ్గాలంటే ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను, సన్నని మాంసాన్ని తినాలి.  అలాగే మీరు ఖచ్చితంగా వ్యాయామం మర్చిపోకుండా చేయాలని మాయో క్లినిక్ సిఫార్సు చేస్తోంది. బ్రిస్క్ వాకింగ్ లేదా రన్నింగ్ వంటి 75 నిమిషాల చురుకైన కార్డియో వంటి వ్యాయామాలను చేయాలి. మీరు  వారానికి కనీసం 150 నిమిషాల మితమైన ఏరోబిక్ కార్యకలాపాలను చేసినా మీ నడుము సైజును తగ్గించుకుంటారు. 
 

సాధారణంగా ఆరోగ్యకరమైన బిఎమ్ఐ 18.5 నుంచి 24.9 మధ్య ఉంటుందని ఎన్ఐహెచ్ తెలిపింది. 18.5 కంటే తక్కువ బీఎమ్ఐ ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నారని అర్థం. అయితే  బిఎమ్ఐ 25 నుంచి 29.9 మధ్య ఉంటే మీరు అధిక బరువు ఉన్నారని అర్థం. 30 లేదా అంతకంటే ఎక్కువ విలువను కలిగి ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. 

click me!