ప్రభాస్ సీత.. కృతి బ్యూటీ సీక్రెట్ ఇదే..!

First Published | Jun 9, 2023, 2:43 PM IST

 క్రమం తప్పకుండా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతుందట. మార్నింగ్ రొటీన్ అనుసరిచడం నుంచి, రాత్రి మేకప్ తొలగించడం వరకు తాను తీసుకునే జాగ్రత్తలను ఆమె ఇటీవల పంచుకున్నారు.

Kriti Sanon

కృతి సనన్ టాలీవుడ్ కి మహేష్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయ్యింది. కానీ, ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఆమె మళ్లీ టాలీవుడ్ లో కనపడలేదు. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా కాలం తర్వాత ఆమె ప్రభాస్ ఆదిపురుష్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.
 

Kriti Sanon

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా, అందులో కృతి లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు. సీత అమ్మవారి పాత్రలో కృతి ఒదిగిపోయింది. చాలా అందంగా కూడా కనిపించింది. మరి కృతి ఇంత అందంగా కనిపించడానికి ఆమె ఏం చేస్తుందో మనమూ తెలుసుకుందాం..
 

Latest Videos


Kriti Sanon

కృతి తన చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. క్రమం తప్పకుండా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతుందట. మార్నింగ్ రొటీన్ అనుసరిచడం నుంచి, రాత్రి మేకప్ తొలగించడం వరకు తాను తీసుకునే జాగ్రత్తలను ఆమె ఇటీవల పంచుకున్నారు.

kriti sanon


ఆమె తన ముఖానికి ఉన్న మేకప్ తొలగించడానికి క్లెన్సింగ్ ఆయిల్ వాడుతూ ఉంటారట. తనకు క్లెన్సింగ్ ఆయిల్ అంటే ఇష్టమని ఆమె చెప్పడం విశేషం. ఆ తర్వాత ఫేస్ వాష్ తో తన ముఖాన్ని మరోసారి శుభ్రం చేసుకుంటుందట.
 

kriti sanon


డబుల్ క్లీన్సింగ్  మురికి, నూనె, చెమట  చర్మంపై వర్తించే ఏదైనా ఉత్పత్తులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం కోలుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సహజ మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేస్తుంది.

చర్మం కోలుకోవడానికి, సహజమైన మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేయడానికి , మేకప్‌లను తొలగించడం చాలా అవసరం అని ఆమె తెలిపింది.
 

kriti sanon

ఇక తన చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఆమె ఆహారం విషయంలో నూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. తాను తన చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి మంచినీరు ఎక్కువగా  తీసుకుంటుందట. దానితో పాటు, కూరగాయల జ్యూస్ కూడా ఆమె రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటుందట. 

kriti sanon


మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని టాక్సీన్స్ అన్నీ తొలగిపోతయాని ఆమె చెప్పడం విశేషం. కాగా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉంటానని ఆమె తెలిపారు.

click me!