మహానటి కీర్తి సురేష్....బ్యూటీ సీక్రెట్స్ ఇవే..!

First Published | Jan 13, 2023, 3:07 PM IST

కీర్తి సురేష్ తన అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకుంటూ ఉంటుంది. దాని కోం ఆమె ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారు. 

దక్షిణాది సంచలనం కీర్తి సురేష్. మహానటి సినిమాతో తాను ఎంత గొప్ప నటో నిరూపించుకుంది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా.... నటన పరంగా రోల్స్ చేయాలి అంటే.. ముందుగా కీర్తి సురేష్ పేరు వినపడుతుంది. సినిమా కెరీర్ లోకి అడుగుపెట్టిన మొదట్లో కొంచెం బొద్దుగా ఉన్న కీర్తి ... ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. అయినా.. ఆమెలో అందం పెరిగిందే కానీ తగ్గలేదు. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం...

కీర్తి సురేష్ తన అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకుంటూ ఉంటుంది. దాని కోం ఆమె ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారు. ఆమె చర్మం మెరుస్తూ ఉండటానికి అది కూడా ఒక కారణం.

Latest Videos


అంతేకాదు... ఆమె ఎంతో బిజీగా ఉన్నా తన ముఖానికి క్లెన్సింగ్, టోనింగ్,  మాయిశ్చరైజింగ్ ని పక్కన పెట్టదట. కచ్చితంగా ఫాలో అవుతుంది.


తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి, తన చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ఆమె ప్రతిరోజూ యోగా చేస్తూ ఉంటారట. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఆమె చర్మం అందంగా మెరుస్తూఉంటుందట.

కెమికల్స్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఆమె అస్సలు ఉపయోగించరట. కేవలం సహజ ఉత్పత్తులను మాత్రమే ఆమె ఉపయోగిస్తారట. అందుకే ఆమె అంత అందంగా కనిపిస్తూ ఉంటారట.

దాదాపు అందరూ మేకప్ అనగానే ఫౌండేషన్  ఉపయోగిస్తూ ఉంటారు. కానీ.. కీర్తి సురేష్ ఫౌండేషన్ వాడదట. దానికి బదులు ఆమె.. బీబీ క్రీమ్  ఉపయోగిస్తారట.


కీర్తి సురేష్  ఎక్కువగా మేకప్ వేసుకోవడానికి  ఇష్టపడరట. చాలా తక్కువ మేకప్ ఉపయోగిస్తారు.హేవీ మేకప్ కి ఆమె దూరంగా ఉంటారట.


మేకప్ వేసుకొని ఆమె అస్సలు నిద్రపోవదట. రాత్రి పడుకునే ముందు ముఖానికి ఉన్న మేకప్ మొత్తం తొలగించిన తర్వాతే ఆమె నిద్రపోతుందట.

Keerthi Suresh-Director Mahesh Kumar

కీర్తి తన ముఖం పై నవ్వు అస్సలు చెరగనివ్వదట. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల కూడా అందంగా కనిపిస్తాం. ఆమె అందానికి అది కూడా ఒక కారణం.

కీర్తి... తన చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో... తన జుట్టు విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటుందట.  తన జుట్టుకు క్రమం తప్పకుండా.. కొబ్బరి నూనెరాస్తూ ఉంటుందట.
 

click me!