మౌనీరాయ్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. నాగిని అంటే ఎక్కువగా గుర్తుపడతారేమో. బుల్లితెరలో సత్తా చాటి.. ఆ తర్వాత.. వెండితెరపై సత్తా చాటుతోంది. మౌనిరాయ్. ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.
ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలని ముంబై వచ్చిన మౌని రాయ్...2004లో వచ్చిన రన్ మూవీలో ఓ సాంగ్ లో డాన్సర్ గా వెండితెర ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఆమె బుల్లితెర బాట పట్టారు. 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో మౌని రాయ్ కీలక పాత్రలు చేయడం జరిగింది.
ఐతే నాగిని సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ లో వచ్చిన మూడు భాగాలలో మౌని రాయ్ నాగిని గా నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ మౌని రాయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెట్టింది.
కెజిఎఫ్ హిందీ వర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేశారు. అక్షయ్ నటించి గోల్డ్ మూవీతో పాటు రాజ్ కుమార్ రావ్ హీరోగా వచ్చిన మేడ్ ఇన్ చైనా మూవీలో మౌని రాయ్ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన మౌని రాయ్ కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. అమితాబ్, రన్బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Mouni Roy and Suraj Nambiar
ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మౌనిరాయ్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరి ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఓసారి చూసేద్దామా.. మౌని బెంగాల్ కి చెందిన బ్యూటీ. సూరజ్ నంబియార్ ని ఆమె వివాహం చేసుకున్నారు.
మౌని ముఖంలో.. ఆమె పెదాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.. ఆ పెదాలు ఎప్పుడూ మృదువుగా ఉండేందుకు మౌనిరాయ్.. ఎక్కువగా లిప్ బామ్ వాడుతూ ఉంటారట.
mouni roy
ఇక తన చర్మం అందంగా మెరిసేందుకు ఆమె అలోవెరా జెల్ ని ఉపయోగిస్తారట. అలోవెరా జెల్ కి.. ఆమె పెద్ద ఫ్యాన్. తరచూ.. తన చర్మం మెరుస్తూ ఉండేందుకు దీనినే ఉపయోగిస్తారట.
ఇక.. తన చర్మం హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట. రోజంతా ఎక్కువగా నీరు తీసుకుంటారట. దాని వల్ల చర్మం తేమగా ఉంటుంది.
తన చర్మం.. మృదువుగా ఉండేందుకు.. పాలు, పసుపు మాస్క్ ని ఉపయోగిస్తారట. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు ఎక్కువగా తీసుకుంటుంది. తాను తీసుకునే ఆహారంలో పండ్లు ఎక్కువ భాగంలో ఉంటాయట. అది కూడా తన అందానికి కారణమని ఆమె చెబుతున్నారు.