ఐదు పదుల వయసులోనూ ఇంత అందం.. జెన్నీ ఫర్ లోపెజ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

Published : Jul 19, 2022, 09:47 AM IST

వయసు ఐదు పదులు దాటినా.. ఆమె కేవలం 20ఏళ్ల పడుచు యువతిలాగా కనపడటం విశేషం. అసలు ఈ వయసులోనూ ఆమె అంత అందంగా ఎలా మెరిసిపోతున్నారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

PREV
18
 ఐదు పదుల వయసులోనూ ఇంత అందం.. జెన్నీ ఫర్ లోపెజ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

జెన్నిఫర్ లోపెజ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఈ అమెరికన్ పాప్ సింగర్.. తాజాగా.. తన నాలుగో పెళ్లితో వార్తల్లోకి ఎక్కారు. 20ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత విడిపోయిన.. మళ్లీ ఇప్పుడు తన ప్రియుడు బెన్ అఫ్లెక్ ని ఆమె పెళ్లాడారు.
 

28

వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి కూతురు గెటప్ లో జెన్నిఫర్ లోపెజ్ చాలా అందంగా కనపడుతున్నారు. ఆమె వయసు ఐదు పదులు దాటినా.. ఆమె కేవలం 20ఏళ్ల పడుచు యువతిలాగా కనపడటం విశేషం. అసలు ఈ వయసులోనూ ఆమె అంత అందంగా ఎలా మెరిసిపోతున్నారు..? ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

38

జెన్నిఫర్ లోపెజ్ తన 20ఏళ్ల వయసులో ఉన్న సమయంలో.. సరైన నిద్ర లేక చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారట. వాటి నుంచి తట్టుకున్న ఆమె.. అప్పటి నుంచి తన లైఫ్ స్టైల్ లో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 9 గంటలు ఆమె నిద్రపోతారు. అది కూడా.. ఆమె అందానికి కారణం కావచ్చు. సరైన నిద్ర.. ఎప్పుడైనా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందనే విషయం మనకు తెలిసిందే.

48

జెన్నిఫర్ లాంటి బాడీ కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. అయితే.. ఆమె లాంటి బాడీ సొంతం కావాలి అంటే... జిమ్ లో కసరత్తులు ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది. ఆమె ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల.. శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది.

58

చాలా మంది సెలబ్రెటీలు వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు. అయితే.. జెన్నిఫర్ లోపెజ్ లాక్ డౌన్ లోనూ తన వ్యాయామాన్ని పక్కన పెట్టలేదు. ఆమె తన ఇంటి గార్డెన్ లోనూ రన్నింగ్ చేసేవారు. అంతేకాకుండా.. ప్రతిరోజూ పుష్ అప్స్ చేస్తూ ఉండేవారు.
 

68

ఇక ఆమె.. తనలోని కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి.. తన బాడీని మంచి షేప్ లో ఉంచుకోవడానికి ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా డ్యాన్స్ చేయడం వల్ల ఆమె మూడ్ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందట.
 

78
Image: Jennifer Lopez/Instagram

ఆమె తన బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు. అందుకోసం ఆమె మంచినీరు చాలా ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాకుండా.. తాజా పండ్లు, ఓట్ మీల్, స్వీట్ పొటాటో, బ్రౌన్ రైస్, కినోవా, పాలకూర, బ్రొకోలీ వంటి వాటిని తీసుకుంటారు.

88

ఆమె తన రోజుని ఎగ్ వైట్స్ తో స్టార్ట్ చేస్తారు. ఇక తన లంచ్, డిన్నర్ లో వైట్ మీట్ ని తీసుకుంటారు. అంటే. టర్కీ, చికెన్ లేదంటే.. గడ్డి మాత్రమే తినే బీఫ్ ని ఆమె తీసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories