ash gourd juice
మనకు మార్కెట్లో చాలా రకాల కూరగాయలు ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కదానికీ ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. కానీ.. బూడిద గుమ్మడికాయను మాత్రం.. మనలో చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. అసలు.. దీనిని కూరగాయగా కూడా గుర్తించని వారు చాలా మంది ఉంటారు. కానీ... ఈ బూడిద గుమ్మడి కాయలో మనం ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. అందాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.
Ash gourd juice
మనం అంతా పెద్దగా పట్టించుకోని బూడిద గుమ్మడికాయను.. విదేశాల్లో అంటే.. ఇంటర్నేషనల్ డిషెస్ గా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఈ సంగతి పక్కన పెడితే... ఈ గుమ్మడికాయను రోజూ జ్యూస్ రూపంలో తీసుకుంటే... అందం పెరిగిపోతుందట.
బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో కెరోటీనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి ముఖ్యంగా.. ఎవరైనా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వడానికి సహాయపడుతుంది.
Ash Gourd
ఈ జ్యూస్ తాగడం వల్ల... చర్మం చాలా ఆరోగ్యంగా తయారౌతుంది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ఫ్యాట్స్ అందులో ఉంటాయి. అంతేకాదు.. ఈ గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. అందానికి ఎలా ఉపయోగపడతుంది అంటే...
Drink ash gourd juice
మీరు నమ్మరు కానీ... ఈ జ్యూస్ తాగడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగడం వల్ల.. చాలా శక్తి లభిస్తుంది. అదే.. ఈ జ్యూస్ లో తేనె కలిసి తీసుకోవడం వల్ల.. చర్మం అందంగా మెరుస్తూ కనపడుతుంది. మన బాడీ కూడా మంచి షేప్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు.
ash gourd juice
ఈ జ్యూస్ తాగడం వల్ల.. చర్మం చాలా హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. మాయిశ్చరైజర్ అవసరం లేనంతగా.. చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ మంచిగా జరిగి... చర్మానికి.. ఓ తెలియని గ్లోని తెచ్చిపెడుతుంది. చర్మం చాలా సహజంగా అందంగా కనపడుతుంది.
ash gourd
ఈ మధ్యకాలంలో చాలా మంది హైపిగ్మెంటేషన్ ఉంటుంది. దాని వల్ల చర్మం మీద అక్కడక్కడ నల్ల మచ్చలు వస్తాయి. అదే.. ఈ జ్యూస్ తాగడం వల్ల.. హై పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందట. ఎందుకంటే.. దీనిలో ఉండే విటమిన్ సి.. చర్మాన్ని.. అందంగా మార్చడంలో, పిగ్మెంటేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలి అంటే.... ఒక బూడిద గుమ్మడికాయ, 6 టీ స్పూన్ల లెమన్, 3 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల మిరియాల పొడి, ఇవి కలిపి జ్యూస్ తయారు చేయవచ్చు. కావాలంటే తేనె కలుపుకోవచ్చు.