ఇంట్లో నెయ్యిని ఎలా తయారుచేయాలో తెలుసా?

First Published | Jun 23, 2024, 1:45 PM IST

నెయ్యి టేస్టీగా ఉండటమే కాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే కొంతమంది మార్కెట్ లో దొరికే నెయ్యిని వాడితే.. మరికొంతమంది ఇంట్లో తయారుచేసిన నెయ్యినే వాడుతుంటారు. కానీ దీన్ని పర్ఫెక్ట్ గా చేయడం చాలా మందికి రాదు. మరి దీన్ని చాలా సింపుల్ గా, పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సాధారణంగా నెయ్యి దాదాపుగా ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. నెయ్యి ఒక్క టేస్ట్ కే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది నెయ్యిని రెగ్యులర్ గా తింటుంటారు. అయితే చాలా మందికి ఇంట్లో నెయ్యిని తయారుచేయడం రాదు. అందుకే మార్కెట్ లో నుంచి కొని వాడుతుంటారు. కానీ నెయ్యి ఇంట్లో చాలా ఈజీగా, ఫాస్ట్ గా తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నెయ్యిని ఎలా తయారుచేయాలి?

ముందుగా పాల పైన పేరుకుపోయిన క్రీమ్ ను ఏరోజుకారోజు ఒక పాత్రలో నిల్వ చేస్తూ ఉండండి. ఈ క్రీమ్ వేసిన గిన్నెను ఫ్రిజ్ లోనే పెట్టండి. గిన్నెలో క్రీమ్ ఎక్కువ అయినప్పుడు దాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీయండి. అయితే క్రీమ్ చాలా రోజులు నిల్వ ఉండేసరికి దాని నుంచి వాసన రావడం మొదలవుతుంది. కానీ ఈ వాసన నెయ్యిని తయారుచేస్తుంటే పూర్తిగా పోతుంది. 
 


అయితే ఫ్రిజ్ లో ఉన్న క్రీమ్ ను బయటకు తీసి అది సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేదాక వెయిట్ చేయాలి. అంటే ఒక అరగంట లోపు నెయ్యిని తయారుచేయాలన్న మాట. ఇప్పుడు క్రీమ్ ను డైరెక్ట్ గా పాన్ లేదా మందపాటి అడుగు భాగం ఉన్న గిన్నెలోకి తీసుకోండి. దీన్ని సన్నని మంట మీద ఐదు నిమిషాలు అలాగే ఉంచండి.
 

ghee

ఆ తర్వాత క్రీమ్ ను బాగా కలుపుతూ ఉండండి. కొద్ది సేపటికే క్రీమ్ లో నుంచి నురగ ఏర్పడటం మొదలవుతుంది. అంటే నెయ్యి బయటకు వస్తుంటుంది అన్న మాట. మీరు మాత్రం అప్పుడప్పుడు క్రీమ్ ను కలుపుతూనే ఉండాలి. అలాగే క్రీమ్ కింది భాగంలో అతుక్కుపోకుండా చూసుకోవాలి.  

కాసేపటి తర్వాత ఈ క్రీమ్ నుంచి నెయ్యి బయటకు రావడం మొదలవుతుంది. నెయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటమీదే ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ నెయ్యిని ఒక సీసాలో జల్లెడపట్టండి. అంతే కొన్ని నిమిషాల్లో కమ్మనైన నెయ్యి రెడీ అయినట్టే.

Latest Videos

click me!