బెండకాయ కూర జిగటగా కాకూడదంటే ఏం చేయాలి?

First Published Jun 23, 2024, 12:44 PM IST

బెండకాయ అంటే చాలా మందికి ఇష్టమే. కానీ బెండకాయ జిగట వల్ల దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి బెండకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి బెండకాయ జిగటగా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ladies finger

ఆరోగ్యకరమైన కూరగాయల్లో బెండకాయ ఒకటి. బెండకాయ కూర, బెండకాయ ఫ్రై అంటూ దీన్ని ఎన్నో విధాలుగా చేసి తినొచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 

ladies finger


కొంతమంది సాంబారులో కూడా బెండకాయలను వేస్తుంటారు. మరికొంతమంది వీటిని ఓన్లీ ఫ్రై చేసుకుని మాత్రమే తింటుంటారు. కానీ దీనిలోని జిగట మాత్రం చాలా మందికి నచ్చదు. అందుకే కూర ఎంత కమ్మగా ఉన్నా పక్కన పెట్టేస్తుంటారు. అందుకే బెండకాయ కూర జిగటగా రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మంచి బెండకాయ 

చాలా మంది బెండకాయలను కొనేటప్పుడు ఎలా ఉన్నాయో చూడరు. పుచ్చులు లేకుంటే చాలనే చూస్తారు. కానీ మీరు కొనే బెండకాయ ముదిరిపోయి ఉండకూడదు. బెండకాయ జిగటగా కాకూడదంటే మీరు కొనే బెండకాయ లేతగా ఉండాలి. ఇందుకోస్ం మీరు ప్రతి బెండకాయను చెక్ చేయాలి. 

Okra

శుభ్రంగా, పొడిగా

చాలా మంది అన్ని కూరగాయలను శుభ్రంగా కడిగినా.. బెండకాయను మాత్రం అస్సలు కడగరు. ఎందుకంటే ఇలా కోస్తే జిగట ఎక్కువ అవుతుందని. కానీ బెండకాయను ఖచ్చితంగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆరబెట్టి తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయ జిగురు తగ్గుతుంది. అలాగే బెండకాయకు ఏమైనా రసాయనాలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. 
 

okra

పెరుగు, నిమ్మకాయ

బెండకాయ జిగురును తగ్గించడానికి పెరుగు కూడా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం బెండకాయ కూర ఉడుకుతున్నప్పుడు అందులో ఒక చిన్న చెంచా పెరుగు వేసి కలపాలి. దీనివల్ల బెండకాయలు ఏం లావు కావు. అలాగే పెరుగు మీ కూరను మరింత టేస్ట్ గా చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో పెరుగు లేకపోతే దానిలో నిమ్మరసాన్ని వేసి కలపండి. 

శెనగపిండి

శెనగపిండి కూడా బెండకాయ జిగటను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బెండకాయ కూరలో కొద్దిగా శనగపిండి వేసి కలపండి.  అలాగే బెండకాయ కూర వండేటప్పుడు దానిపై మూత పెట్టకూడదు. బెండకాయ కూరను వండేటప్పుడు గిన్నెపై మూత పెట్టి క్లోజ్ చేయకూడదు. ఇలా చేస్తే బెండకాయ కూర జిగటగా అవుతుంది.
 

Latest Videos

click me!