టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు అనగానే ప్రస్తుతం అందరూ పూజా హెగ్డే పేరే చెబుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ పూజా నటించేసింది. మళ్లీ అదే హీరోలతో రెండోసారి కూడా జోడీ కట్టడానికి ఈ బుట్టబొమ్మ రెడీ అయిపోయింది.
పూజా అందానికి ఎవరైనా ఇట్టే ఎట్రాక్ట్ అవ్వాల్సిందే. అందుకే.. పూజ కి టాలీవుడ్ తో పాటుు బాలీవుడ్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి పూజా తన అందాన్ని కాపాడుకోవడాని ఏం చేస్తుందనే విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.
పూజ సహజంగానే అందంగా ఉంటుంది. కానీ.. ఆ అందాన్ని కాపాడుకోవడానికి మాత్రం సహజమైన పద్దతులను ఫాలో అవుతుందట.
పూజ సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తుంది. పసుపులో తాజా క్రీమ్ ని కలిపి ముఖానికి రాసుకుంటుందట. ఈ ఫేస్ ప్యాక్ తరచూ వాడతూ ఉంటుందట. అదే తన బ్యూట సీక్రెట్ అని పూజా చెప్పడం గమనార్హం.
చాలా మంది డైట్ లో భాగంగా కార్బో హైడ్రేట్స్ తీసుకోరు. కానీ.. పూజ మాత్రం కార్బో హైడ్రేట్స్ అస్సలు తినకుండా ఆగదట. అంతేకాకుండా చర్మం తాజాగా నిగారించేందుకు ఆమె ఆహారంలో నెయ్యి కూడా తీసుకుంటుందట.
పూజ ఉదయాన్నే లేవగానే.. ముఖాన్ని శుభ్రంగా చల్లని నీటితో కడుగుతుందట. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాస్తుందట. తరచూ ఇలా చేయడం వల్ల తన చర్మం అందంగా ఉంటుందని ఆమె నమ్ముతుంటారు.
ఇక షూటింగ్స్ లేకపోతే పూజ అస్సలు మేకప్ వేసుకోదట. సహజంగా ఉండటానికే ఇష్టపడుతుందట. కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే మేకప్ వేసుకుంటానని ఆమె చెప్పడం గమనార్హం.
అంతేకాదు.. చర్మం ట్యాన్ గా అవ్వకుండా ఉండేందుకు ఆమె తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారట. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉంటుందట.