జుట్టుకు బెండకాయ నీళ్లను ఇలా వాడితే.. మీ జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది

First Published | Nov 18, 2024, 1:33 PM IST

బెండకాయలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం మన శరీరానికి మాత్రమే కాదు.. మన జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టుకు బెండకాయ నీళ్లను ఉపయోగించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? 

okra water

బెండకాయ ఒక కూరగాయ. దీన్ని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ బెండకాయ మన జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ముచ్చట ఎవరికైనా తెలుసా?  నిజానికి బెండకాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ బెండకాయ నీళ్లు మన జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బెండకాయ నీళ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, బాగా పెరగడానికి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అసలు బెండకాయ నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జుట్టుకు బెండకాయ నీళ్లు

బెండకాయలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బెండకాయలోని పోషకాలు ఎక్కువగా ఉండే నీళ్లను జుట్టుకు సంరక్షణకు ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. హెల్త్ లైన్ ప్రకారం.. బెండకాయలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్ లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

Latest Videos


జుట్టుకు బెండకాయ నీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

నేచురల్ కండీషనర్

బెండకాయ నీటివల్ల జుట్టుకు కలిగే మొదటి ప్రయోజనాల్ల..  తేమను లాక్  చేయడం ఒకటి. నిపుణుల ప్రకారం.. బెండకాయలో ఉండే మ్యూసిలేజ్ నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. అంటే ఇది మన జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే జుట్టు పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. తరచుగా డీహైడ్రేట్ అయ్యే జుట్టు, కర్లీ లేదా ఇతర జుట్టు రకాలు నీరసంగా, నిర్జీవంగా, వెంట్రుకలు తెగిపోయే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. 

జుట్టుకు బెండకాయ నీళ్లను ఉపయోగించడం వల్ల మీ జుట్టును సాఫ్ట్ గా అవుతుంది. తేమగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బెండకాయ నీళ్లతో జుట్టును వాష్ చేయడం లేదా లీవ్-ఇన్ చికిత్సగా ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
 


జుట్టు పెరుగుతుంది

పొట్టి జుట్టు ఉన్నవారు జుట్టు పెరగడానికి ఎన్నో రకాల నూనెలను, షాంపూలను మారుస్తుంటారు. అయితే ఇలాంటి వారికి బెండకాయ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అవును బెండకాయ నీటిని ఉపయోగించి పొట్టి జుట్టు పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు. బెండకాయ వాటర్ లో ఉండే పోషకాలు, విటమిన్లు జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తాయి.

దీంతో మీ జుట్టు బలంగా, ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ముఖ్యంగా బెండకాయలో ఉండే ఫోలెట్ కొత్త కణాలు ఉత్పత్తి కావడానికి, కణాల విభజనకు బాగా సహాయపడుతుంది. ఈ ఫోలెట్ జుట్టు పెరగడానికి చాలా వసరం. బెండకాయ నీళ్లను రెగ్యులర్ గా జుట్టుకు ఉపయోగిస్తే మీ నెత్తిమీద రక్త ప్రసరణను సక్రమంగా జరుగుతుంది. దీంతో ఫాస్ట్ గా మీ జుట్టు పెరుగుతుంది. 

బలమైన జుట్టు 

బెండకాయ నీళ్ల వల్ల మన జుట్టుకు కలిగే మరొక ప్రయోజనం.. బలమైన జుట్టు.  ఇది వెంట్రుకలను బాలంగా చేస్తుంది. ఈ వాటర్ లో ఉండే విటమిన్లు జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇది జుట్టు తెగిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. జుట్టు రాలుతున్నా, బాగా తెగిపోతున్నా మీరు రెగ్యులర్ గా బెండకాయ నీళ్లను వాడండి. 

బెండకాయ వాటర్ జుట్టును బలంగా చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే చుండ్రు, దురద వంటి నెత్తి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బెండకాయ వాటర్ లో ఉండే లక్షణాలు జుట్టు పెరిగేలా చేస్తాయి. బెండకాయ చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 


నెత్తి ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ముందునెత్తి ఆరోగ్యంగా ఉండాలి. ఈ బెండకాయ వాటర్ నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ వాటర్ లో ఉండే శోథ నిరోధక లక్షణాలు నెత్తి చిరాకును తగిస్తాయి. నెత్తిని శుభ్రంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తుంది. 

నల్లగా ఉంచుతుంది

మీకు తెలుసా? బెండకాయ వాటర్ మన జుట్టును నేచురల్ రంగులో ఉంచడానికి, సహజ మెరుపును ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది. బెండకాయ వాటర్ అందించే పోషకాలు, తేమ జుట్టు క్యూటికల్ ను మృదువుగా చేస్తాయి. అలాగే జుట్టుకు మంచి షైనీని ఇస్తాయి. 

click me!