skin pigmentation
ఈ రోజుల్లో చాలా మందిని పిగ్మెంటేషన్ సమస్య వేధిస్తోంది. ముఖంలోని పలు ప్రదేశాల్లో నల్లటి మచ్చల్లా వచ్చి... ముఖ అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి. మరి ఆ పిగ్మెంటేషన్ తొలగించాలంటే... కేవలం మార్కెట్లో లభించే క్రీములు రాస్తే సరిపోదు. వాటి వల్ల ఫలితం అందరికీ లభించకపోవచ్చు. అయితే... ఈ ఆయుర్వేద ట్రిక్స్ తో పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Kumkumadi Tailam
పిగ్మెంటేషన్ ని తొలగించడానికి ముందుగా.. కొన్ని చుక్కల కుంకుమాది నూనె తీసుకోవాలి. దానిలో కొద్దిగా అలోవెరా జెల్, చిటికెడు పసుపు కలపాలి. ఈ పేస్టును రోజుకు రెండుసార్లు ముఖానికి అప్లై చేయాలి. 25 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల నెమ్మదిగా మచ్చలు తొలగిపోతాయి.
ఎక్కువగా పిగ్మెంటేషన్... ఎండ కారణంగా వస్తూ ఉంటుంది. కాబట్టి... ముందుగా.... ఎండ డైరెక్ట్ గా పడకుండా జాగ్రత్త పడాలి. దానికి.. ఎండలో వెళ్లినప్పుడు హ్యాట్ లాంటివి ధరించాలి. అంతేకాకుండా.. హెర్బల్ సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి.
పిగ్మెంటేషన్ తొలగించే క్రమంలో... మనం తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ , డ్రై ఫ్రూట్స్, బట్టర్ లాంటివి తినాలి. ఇవి మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.
మనం అందంగా కనపడటానికి మన శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి. అందుకోసం కాలంతో సంబంధం లేకుండా... అన్ని కాలంలోనూ... మంచినీరు ఎక్కువగా తాగాలి. దీని వల్ల.. చర్మం సహజంగా మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది.
ప్రతిరోజూ ముఖాన్ని క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్లీనింగ్ చేస్తూ ఉండటం వల్ల కూడా... పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టొచ్చు. హెర్బల్, ఆయుర్వేదిక్ ఫేస్ వాష్ లు అందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది.