ఇక హైదరాబాద్ నగరంలో.. ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.64, 940గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ.70, 850కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం. వెండి రేటు కూడా గత రెండు రోజుల్లో కిలోకు దాదాపు 4 వేల రూపాయలకుపైగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 87,400కు చేరింది.