హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా..? కారణం ఇదే కావచ్చు..!

First Published May 24, 2021, 11:55 AM IST

మీ శరీరంలోని మార్పులు కూడా జట్టుపై పడతాయి. మీరు తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గినప్పుడు జుట్టు రాలే సమస్య అధికమౌతుంది.

ప్రస్తుత కాలంలో.. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా.. కామన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం.. హెయిర్ ఫాల్. ఎంత ఖరీదైన నూనెలు వాడుతున్నా... అంతే ఖరీదైన షాంపూలు, సీరమ్ లు వాడుతున్నా కూడా.. జుట్టు రాలడం మాత్రం ఆగడం లేదు. దీంతో.. ఏం చేయాలో తెలియక జుట్టు మీద బెంగ పెట్టేసుకుంటున్నారు.
undefined
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. జుట్టురాలుతోందంటే.. దానికి కొన్ని కారణాలు ఉన్నాయట. వాటిలో ప్రధానమైనది వాతావరణంలో మార్పులు. వాతావరణం సడెన్ గా మారడం వల్ల కూడా జట్టు విపరీతంగా రాలడం మొదలౌతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా.. జుట్టు రాలడం మొదలౌతుందట. జట్టు బలంగా ఉండాలంటే.. దానికి సరైన పోషణ చాలా అవసరం. అది లేకున్నా కూడా జుట్టు రాలుతుంది. ఈ కారణాలు కాకుండా.. మరో నాలుగు కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందట.
undefined
మీ శరీరంలోని మార్పులు కూడా జట్టుపై పడతాయి. మీరు తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గినప్పుడు జుట్టు రాలే సమస్య అధికమౌతుంది.
undefined
మీరు సరైన డైట్ తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం లేదంటే.. కడుపు మాడ్చుకొని డైట్ చేయడం.. ఇలా చేసినప్పుడు కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది.
undefined
మీ శరీరానికి సరైన ప్రోటీన్ ఆహారం అందినప్పుడే.. మీ జట్టు ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించాలి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, క్యాలరీలు అందని సమయంలోనూ.. జట్టుకి బలం చేకూరక ఎక్కువగా ఊడిపోతుంటుంది.
undefined
జింక్, విటమిన్ బీ12, ఐరన్ లోపం ఉన్నవారిలోనూ జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ పై సమస్యలు తగ్గించుకుంటే.. మీ జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
undefined
click me!