రోజూ స్నానానికి ముందు ముఖానికి ఇవి పెడితే మీరెంత అందంగా కనిపిస్తారో..!

First Published | Sep 1, 2024, 1:50 PM IST

ఆడవాళ్లు అందంగా కనిపించేందుకు ఏవేవో క్రీములను ముఖానికి వాడుతుంటారు. కానీ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాడితే అందంగా కనిపించడం సంగతి పక్కన పెడితే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ కొన్ని ఇంట్లో దొరికే వాటిని మీ ముఖానికి పెడితే మీరు అందంగా కనిపిస్తారు. వీటికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. 
 

ప్రతి ఒక్క మహిళ తన చర్మంపై ఒక్క మచ్చకూడా లేకుండా ఉండాలని కోరుకుంటుంది. అలాగే అందంగా కనిపించాలని కోరుకుంటుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలా మంది  రకరకాల  బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. అయినా చాలా సార్లు ఆశించిన ఫలితాలు మాత్రం రావు. అందుకే చాలా మంది మార్కెట్లో దొరికే క్రీములు, బ్యూటీ ట్రీట్ మెంట్స్ ను వాడుతుంటారు. కానీ వీటివల్ల  చర్మం దెబ్బతింటుంది. ఉన్న అందం కూడా తగ్గుతుంది. 
 

మీకు తెలుసా? పైసా ఖర్చు లేకుండా.. ఇంట్లో ఉండే వాటితోనే మనం అందంగా రెడీ అవ్వొచ్చు. ఇవి మీకు శాశ్వత అందాన్ని ఇస్తాయి. వీటివల్ల మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుంది. అందులోనూ ఇవి మీ చర్మానికి గానీ, ఆరోగ్యానికి గానీ ఎలాంటి హాని చేయవు.

ఇవి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తాయి.  అందుకే స్నానం చేయడానికి ముందు మీరు ముఖానికి పెట్టాల్సిన కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పసుపు, శెనగపిండి

పసుపు, శెనగపిండి రెండింటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ రెండూ అందాన్ని పెంచడానికి కూడా బాగా సహాయపడతాయి. మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే రోజూ స్నానానికి ముందు పసుపు, శెనగపిండిని కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోండి. అయితే దీనిని ఉపయోగించే ముందు ప్రతి  ఒక్కరూ స్కిన్ పై ప్యాచ్ టెస్ట్ ను ఖచ్చితంగా చేయాలి. దీంతో మీకు అలెర్జీ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇది మీ చర్మం మెరిసేలా చేస్తుంది.
 

Latest Videos


కీరదోసకాయ రసం

కీరదోసకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఇది ఒక్క ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని జ్యూస్. అవును కీరదోసకాయ జ్యూస్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందుకోసం కీరదోసకాయను గ్రైండ్ చేసి దాని రసాన్ని ముఖానికి అప్లై చేయొచ్చు. స్నానానికి ముందు చర్మానికి అప్లై చేయండి.

ముల్తానీ మట్టి

ముల్తామి మట్టి మన ముఖానికి చేసే మేలు ఎంతో. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ముఖానికి అప్లై చేస్తే ప్రయోజకరంగా ఉంటుంది. ఇందుకోసం రోజ్ వాటర్ లో 2 చెంచాల ముల్తానీ మిట్టి మిక్స్ చేసి రోజూ స్నానానికి ముందు అప్లై చేయండి. అయితే పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టిని ఉపయోగించకూడదు.
 

గంధపు చెక్క

గంధంలో చర్మాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు, ఎరుపు తగ్గుతాయి. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల గంధం పొడి తీసుకోండి. దీనిలోరోజ్ వాటర్ వేసి పేస్ట్ లా తయారుచేసుకోండి. స్నానానికి 15 నిమిషాల ముందు ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయండి. ఇది ముఖాన్ని చల్లగా ఉంచుతుంది. 

click me!