జుట్టు కోసం నెయ్యి
ఈరోజుల్లో జుట్టురాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడమే కాదు... చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతుంది. ఇక... ఆ తెల్ల జుట్టును కవర్ చేయడానికి రంగులు వేస్తూనే ఉంటారు. అలా రంగులు వేయడం వల్ల మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయి. అయితే.. రంగులు వేసే పని లేకుండా..కేవలం సహజంగా కొన్ని రెమిడీస్ ప్రయత్నించడం వల్ల.. మీ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
జుట్టు కోసం నెయ్యి
ప్రతిరోజూ ఉపయోగించే ఒక వంటింటి పదార్థం జుట్టు సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి , ముందస్తుగా నెరిసిన జుట్టు నివారించడానికి బెస్ట్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం..
జుట్టు కోసం నెయ్యి
1 టేబుల్ స్పూన్ నెయ్యిని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. దీన్ని జుట్టుకు పట్టించండి. కొంత సమయం తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. కొద్దిగా నెయ్యి తీసుకుని వేడి చేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. దీన్ని మీ జుట్టుకు మసాజ్ చేయండి. మీ జుట్టు మృదువుగా , ఆరోగ్యంగా పెరగడం ప్రారంభమవుతుంది.
జుట్టు కోసం నెయ్యి
జుట్టులో తేమను నిలుపుకోవడానికి కూడా నెయ్యిని ఉపయోగించవచ్చు. ఇందులో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. నెయ్యితో ఆమ్లా రసం కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. నెల్లీకాయను ముక్కలుగా కోసి, రసం తీయండి. దీనికి నెయ్యి కలపండి. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు కోసం నెయ్యి
ఉల్లిపాయ రసాన్ని నెయ్యితో కలిపి మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయను ముక్కలుగా కోసి, రసం తీయండి. దీనికి నెయ్యి కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్యకు మంచి ఫలితం లభిస్తుంది.
జుట్టు కోసం నెయ్యి
అదేవిధంగా, నెయ్యి, బాదం నూనె , నిమ్మరసం కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని, దానికి బాదం నూనె , నిమ్మరసం కలపండి. వారానికి ఒకసారి దీన్ని ఉపయోగిస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
జుట్టు కోసం నెయ్యి
నెయ్యి , ఆలివ్ నూనెతో మాస్క్ తయారు చేయండి. ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని, దానికి ఆలివ్ నూనె కలపండి. వారానికి ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.