చింతపండును చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సాంబార్, రసం, చింతపండు పులుసు, చింతపండు అన్నం వంటి ఎన్నో రకాల వంటల్లో చింతపండును ఉపయోగిస్తారు. నిజానికి చింతపండులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటుగా ఇంటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని ఆమ్ల గుణమే ఇందుకు సహాయపడుతుంది.