గత జనవరిలో కూతురు ‘వామిక’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మమ్మీ అనుష్క, పాప పుట్టక ముందు తన స్థితి గురించి, మరిన్ని ముచ్చట్లు చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన మొదట్లో ఆమె తెగ భయపడేదట! ‘‘అసలు నేను తల్లిగా మారటాన్ని ఆస్వాదించగలనా? తల్లి అయ్యాక నాకు ఆ స్థితి నచ్చుతుందా?’’ వంటి ప్రశ్నలు ఆమెకు కలిగేవట! అయితే, కూతురు పుట్టాక ఇప్పుడు తాను ఎంతో ఎదిగానంటోంది అనుష్క. ఒక వ్యక్తిగా బాగా మారానని ఆమె చెప్పారు.