shruti hasan
అందం శాశ్వతం కాదు అనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజు పూసిన పువ్వు.. ఎంత అందంగా ఉన్నా.. మరుసటి రోజుకి వాడిపోవాల్సిందే. కేవలం పూల విషయంలోనే కాదు.. మనుషుల విషయంలోనూ అది వర్తిస్తుంది. ఒక వయసులో అందరూ అందంగా ఉంటారు. వయసు పెరిగే కొద్దీ.. ఆ అందం తగ్గిపోతూ వస్తుంది. ఇది నమ్మదగిన సత్యం.
ఈ విషయం తెలిసినా.. మనలో చాలా మంది ఆ అందాన్ని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హాట్ బ్యూటీ శ్రుతి హాసన్ కూడా.. అదేవిధంగా.. తన అందాన్ని పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలపై శృతి హాసన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
Shruti Hasan
ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు.. తమ బాడీలోని కొన్ని అవయవాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. వారిలో శ్రుతి హాసన్ కూడా ఉన్నారని మనందరికీ తెలుసు. అయితే.. ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలా మంది ముందుకు రారు. కానీ.. శ్రుతి మాత్రం.. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని అంగీకరించడం విశేషం.
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని.. ఈ విషయంలో తాను సంతోషంగా ఉన్నానని.. ఆ నిజం అంగీకరించడానికి తనకు ఎలాంటి భయం, సిగ్గు లేవని.. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో వివరించడం గమనార్హం.
అయితే.. తనలాగే... ఇతరులు కూడా చేయించుకోవాలని ప్రమోటింగ్ మాత్రం చేయడానికి ఆమె ముందుకు రాను అని చెప్పింది. ఎవరికి నచ్చినట్లు వారు జీవించాలని.. ఈ విషయంలో ఒకరిపై బలవంతం తీసుకురాకూడదని.. అందుకే తాను ప్రమోట్ చేయనని చెప్పింది.
ఇప్పటి వరకు చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని.. కానీ.. వారు ఆ విషయాన్ని అంగీకరించరని ఆమె అన్నారు. ఎందుకు ప్రజలు.. ఒకేసారి అలాంటి ఛేంజ్ ని యాక్సెప్ట్ చేయరని.. అందుకే ఈ విషయాన్ని దాచాలని అనుకుంటారని ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
కాగా.. మన శరీరంలో జరిగే మార్పులను మనం యాక్సెప్ట్ చేయాలని.. మనం ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకోగలగాలని.. అప్పుడే మనం అందంగా ఉండగలమని శ్రుతి పేర్కొన్నారు. తాను చేసుకున్న మార్పు తనకు నచ్చిందని ఆమె చెప్పారు.