ఈ డైట్ కారణంగానే.. అనుష్క మళ్లీ సన్నపడింది..!

First Published | Nov 12, 2021, 2:22 PM IST

ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు.. మంచి  లైఫ్ స్టైల్ ఏంటి అనే విషయాలు, బరువు తగ్గడం ఎలా అనే విషయంపై అనుష్క పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం ప్రకారం.. ఆరు డైట్ సీక్రెట్స్ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గొచ్చట.
 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లలో అనుష్క ముందు వరసలో ఉంటారు. సినిమా కెరిర్ ప్రారంభించిన కొత్తలో అనుష్క చాలా నాజుకుగా కనిపించేది. కానీ.. సైజ్ జోరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. దానిని తగ్గించడానికి చాలా సమయం తీసుకున్నా.. మళ్లీ.. నాజుకుగా ఎప్పటిలాగానే మారి.. అందరినీ ఆకట్టుకుంటోంది.

Anushka Shetty

అయితే... అనుష్క.. తన బరువు తగ్గడానికి ఏం చేసింది..? ఏ ట్రిక్స్ ఫాలో అయ్యి.. ఆమె మళ్లీ మునిపటిలా మారింది అనే విషయాన్ని తాజాగా వివరించింది. ఆమె తన డైట్ లో చేసుకున్న కొన్ని మార్పులతో మళ్లీ నాజుకుగా మారారట. మరి ఆ మార్పులేంటో మనమూ చూసేద్దామా..

Latest Videos


ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు.. మంచి  లైఫ్ స్టైల్ ఏంటి అనే విషయాలు, బరువు తగ్గడం ఎలా అనే విషయంపై అనుష్క పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం ప్రకారం.. ఆరు డైట్ సీక్రెట్స్ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గొచ్చట.

చర్మాన్ని.. హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి అనుష్క ఎప్పుడూ మంచినీరు తాగుతూ ఉంటుందట. రోజంతా వాటర్ తాగుతూ ఉంటుందట. సినిమా షూటింగ్స్  జరుగుతున్నప్పుడు కూడా వాటర్ గానీ.. కొబ్బరి నీరు కానీ తాగుతూ ఉంటుందట. షూటింగ్ మధ్యలో కొబ్బరి నీరు తాగుతానని ఆమె చెప్పారు. దాని వల్ల తన చర్మం మెరుస్తూ.. అందంగా కనపడటానికి సహాయం చేస్తుంది.

అనుష్క ప్రతిరోజూ.. పచ్చని కూరగాయలను ఆహారంగా తీసుకుంటుంది. అ ంతేకాదు.. తన డైట్ లో కచ్చితంగా.. ఫైబర్ ఉండేలా చూసుకుంటుందట. కూరగాయల రూపంలోనే ఫైబర్ తీసుకుంటుందట. తన భోజనంలో ఎక్కువ భాగం కూరగాయలకే ఇస్తుందట.

చాలా మందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఈ క్రేవింగ్స్ తీర్చుకోవడానికి చాలా మంది కేక్స్, కుకీస్ అంటూ.. జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. దానిని కంట్రోల్ చేసుకోవడానికి.. కొద్ది కొద్దిగా ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలని  సూచిస్తోంది.

ఇక.. అనుష్క తన డిన్నర్ ని రాత్రి 8గంటల లోపే పూర్తి చేసేస్తుందట. అలా త్వరగా డిన్నర్ చేయడం వల్ల.. అరుగుదల సమస్యలు రాకుండా ఉంటాయి.. మెటాబాలిజం కరెక్ట్ గా ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.

ఇక అనుష్క తన ఆహారంలో పంచదార, మైదా వంటి వాటికి అస్సలు చోటు ఇవ్వదట. ఇంట్లో తన సొంతంగా వండుకున్న ఆహారాన్ని తింటుందట. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసే ఆహారం, ప్రాసెస్డ్ ఆహారం చాలా దూరంగా ఉంటుంది.

ఇక అనుష్క తన ఆహారంలో పంచదార, మైదా వంటి వాటికి అస్సలు చోటు ఇవ్వదట. ఇంట్లో తన సొంతంగా వండుకున్న ఆహారాన్ని తింటుందట. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసే ఆహారం, ప్రాసెస్డ్ ఆహారం చాలా దూరంగా ఉంటుంది.

ఇక ఈ ఆహార జాగ్రత్తలతోపాటు.. ఆరోగ్యంగా ఉండేందుకు.. ఆమె ప్రతిరోజూ వర్కౌట్స్ చేస్తుందట. ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ కచ్చితంగా చేస్తుందట. ఒక్క రోజూ కూడా మిస్ చేయదట.

click me!