త్రిష సీక్రేట్ ఇదా.. అందుకే ఇంత అందంగా ఉందా?

First Published | Aug 11, 2024, 2:52 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్ర హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. మరెంతో మంది బయటకు వెళ్లిపోతూనే ఉన్నారు. కానీ త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ వయసులో కూడా త్రిష వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఈ హీరోయిన్ అందం రోజు రోజుకు మరింత పెరిగిపోతూనే ఉంది. 
 

త్రిష అన్నం తింటుందా? అందం తింటుందా? అని అభిమానులు అనుకునేలా చేస్తుంది. ఈ బ్యూటీ యవ్వనంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అసలు ఈమె వయసు 41 ఏండ్లు అన్నట్టు లేనేలేదు. అంతేనా ఈ బ్యూటీ వయసు రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ వయసులో కూడా మంచి మంచి సినిమా ఆఫర్లను అందుకుంటోంది. అసలు త్రిష  41 ఏండ్లలో కూడా అందంగా ఉండటానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఉదయాన్నే వ్యాయామం 

వ్యాయామం శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుందన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ కొంతమంది మాత్రమే దీన్ని ఫాలో అవుతారు. అయితే హీరోయిన్ త్రిష బ్యూటీ సీక్రేట్ ఇదే. అవును ఈమె ఉదయం  నిద్రలేచిన తర్వాత ఒక గంటపాటు వ్యాయామం చేస్తుంది. కార్డియోతో పాటుగా మరికొన్ని వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తుందట. 
 



డిన్నర్ 

త్రిష వీలైనంత తొందరగా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. ఈమె సాయంత్రం 6.30 గంటలకే భోజనం అయిపోగొట్టి.. ఆ  తర్వాత పండ్లు కూడా తినదట. అలాగే తిన్న వెంటనే నీళ్లు తాగనేతాడదు. 
 

పండ్లు, కూరగాయలు

త్రిష పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటుంది. ఈమె తినే పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా చూస్తుందట. ఇవి ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

యోగా

లియో హీరోయిన్ త్రిషకు  యోగా చేసే అలవాటు కూడా ఉందట. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా.. ఆమె ప్రతిరోజూ యోగాను ఖచ్చితంగా చేస్తుందట. ఈ విషయాన్ని మనం ఆమె  ఇన్స్ స్టా పోస్టుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 

actress trisha

వెయిట్ లాస్ 

స్విమ్మింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ త్రిషకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీస్.ఈమె తన చిన్నప్పటి నుంచి కూడా వీటిని రోజూ చేసుకుంటూ వస్తుందట. ఇవి శరీరంలో ఎక్సా ట్రా కేలరీలను బర్న్ చేస్తాయి. అలాగే బరువు పెరగకుండా కాపాడుతాయి. 
 

Latest Videos

click me!