హెయిర్ మాస్క్ తయారీ...
ముందుగా, ఒక పాత్ర తీసుకొని, దానికి 2 గ్లాసుల నీరు వేసి వేడి చేయండి.
నీరు కొద్దిగా మరిగేటప్పుడు, దానికి 1 బౌల్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి, నీటిని 10-15 నిమిషాలు మరిగించండి.
గింజలు నీటిలో మరిగేటప్పుడు, ఒక గిన్నె నీటిలో 2 టీస్పూన్ల బియ్యం పిండిని కలపండి.
ఇప్పుడు ఈ పిండి-నీటి మిశ్రమాన్ని పాన్‌లో వేసి కలపండి.
మరో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్న నీరు జెల్‌గా మారడం ప్రారంభమౌతుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అది చల్లబడే ముందు జెల్‌ను ఒక గిన్నెలోకి తీసివేయండి.
తయారుచేసిన రెసిపీ చల్లబడిన తర్వాత, దానిని మీ జుట్టుకు బాగా అప్లై చేసి 30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత తలస్నానం చేస్తే చాలు. వారానికి రెండు రోజులు చేసినా.. జుట్టు అందంగా మారడం పక్కా.