2.మునగాకు టీ…
మునగాకు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్. దీనిని అన్ని రకాల వయసుల మహిళలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. 40 దాటిన మహిళలు కచ్చితంగా తీసుకోవాలి. టీ గా మాత్రమే కాదు.. వేరే రూపంలో కూడా ఈ మునగాకులను తీసుకోవచ్చు.
ఈ టీ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఐరన్, కాల్షియం అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఈ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, మూడ్ స్వింగ్‌లను కూడా తగ్గిస్తుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.
ఈ టీ 40 ఏళ్ల తర్వాత కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.