అనుష్క శెట్టికి అలాంటి అరుదైన వ్యాధి ఉందా..?

First Published | Jun 21, 2024, 4:58 PM IST

అనుష్క శర్మ చాలా కాలంగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.


టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క శెట్టి. తన గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  స్టార్ హీరోలతో సినిమాలు చేసి బాక్సాఫీసును షేక్ చేసిన ఆమె... సింగిల్ గా ఉమెన్ ఓరియంటెడ్ మూవీలు చేసి కూడా అంతే ఆకట్టుకుంది. ఉమెన్ ఓరింటెడ్ సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేయడంలో అనుష్క తర్వాతే ఎవరైనా. నిజానికి..  హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత... ఇలాంటి సినిమాలు చేస్తారు. కానీ.. అనుష్క మాత్రం కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే... ఇలాంటి సినిమాలు అంగీకరించింది.  రీసెంట్ గా.. చాలా గ్యాప్ తర్వాత.. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక.. అసలు విషయానికి వస్తే.. అనుష్క శర్మ చాలా కాలంగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
 


ఇంతకీ ఆమె బాధపడుతున్న వ్యాధి ఏంటో తెలుసా...? నవ్వడం. నవ్వడం ఒక వ్యాధి ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అనుష్క ప్రాబ్లం ఏంటంటే... ఒక్కసారి నవ్వింది అంటే.. ఆమె ఆ నవ్వును ఆపుకోలేరట. కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటారట.  ఎదైనా జోక్ విన్నా, ఏదైనా కామెడీ సీన్ చూసినా.. ఆమె నవ్వడం మొదలుపెట్టింది అంటే.. చాలా సేపు అలా నవ్వుతూనే ఉంటారట. ఈ ప్రాబ్లంతో తాను చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పడం గమనార్హం.


ఈ అనియంత్రిత నవ్వు కారణంగా చాలా సార్లు ఇబ్బంది పడ్డానని.. మఖ్యంగా ఏదైనా కామెడీ సీన్ లో నటించాల్సి వచ్చినప్పుడు మరింత ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ఆ సీన్ అయిపోయిన తర్వాత కూడా...  తన నవ్వు ఆగదట. తన నవ్వు ఆగదని గ్రహించి.. మూవీ సెట్ లో వారంతా బ్రేక్ తీసుకునేవారట. ఒక్కోసారి వాళ్ల బ్రేక్ పూర్తి అయినా కూడా తన నవ్వు ఆగేది కాదని చెప్పడం గమనార్హం. 

Latest Videos

click me!