కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి పెడితే మీ జుట్టు పెరగడం పక్కా..

First Published | Sep 5, 2024, 10:13 AM IST

పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్క మహిళకూ ఉంటుంది. కానీ చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. జుట్టుపెరగాలని నూనెలను, షాంపూలను తరచుగా మారుస్తూ ఉంటారు. కానీ మీరు కొబ్బరి నూనెలో కొన్నింటిని కలిపి పెడితే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అవేంటంటే?
 

ప్రస్తుత కాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, సరైన ఆహారాలను తీసుకోకపోవడం, కలుషితమైన గాలి, నీరు, చెడు జీవనశైలి వల్ల చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటారు.

వీటివల్ల జుట్టు విపరీతంగా రాలడమే కాదు.. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఇక జుట్టు పెరగాలని చాలా మంది మార్కెట్ లోకి వచ్చని ప్రతి నూనెను వాడుతుంటారు. షాంపూలను మారుస్తుంటారు. కానీ వీటివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. నిజానికి జుట్టు పెరగాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

జస్ట్ కొబ్బరి నూనెలో కొన్నింటిని కలిపి జుట్టుకు రాస్తే సరిపోతుంది. వెంట్రుకలు పెరగడానికి కొబ్బరి నూనెలో ఏం కలిపి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జుట్టుకు కొబ్బరి నూనె చేసే ప్రయోజనాలు 

చాలా మంది కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టనే పెట్టరు. కానీ కొబ్బరి నూనె మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు డ్రై గా అయ్యే అవకాశమే ఉండదు.

అలాగే నిర్జీవ జుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనె వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టుకు నేచురల్ కలర్ ను, షైనింగ్ ను అందిస్తుంది. 


కొబ్బరి నూనెలో గుడ్డును కలిపి వాడితే ఏం జరుగుతుంది? 
 
వినడానికి వింతగా ఉన్నా.. మీరు కొబ్బరి నూనెలో కోడిగుడ్డును కలిపి వాడొచ్చు. అవును కోడిగుడ్డును కొబ్బరినూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ హెయిర్ స్ట్రాంగ్ గా అవుతుంది. అలాగే పొడుగ్గా పెరుగుతుంది.

ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి.


కొబ్బరి నూనె, కోడి గుడ్డును జుట్టుకు ఎలా అప్లై చేయాలి? 

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 టీస్పూన్ల కొబ్బరినూనెను పోయండి. దాంట్లోనే గుడ్డును బాగా కలపండి. ఇప్పుడు దీన్ని తలకు, వెంట్రుకలకంతా బాగా పట్టించండి. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో మీ జుట్టును కడిగేయండి. 
 

కొబ్బరి నూనెలో మెంతి గింజలను వేసి పెడితే ఏం జరుగుతుంది? 

కొబ్బరినూనె, మెంతుల కాంబినేషన్ కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జుట్టు ఫాస్ట్ గా పెరగడానికి బాగా సహాయపడుతుంది.

దీనికోసం కొబ్బరి నూనెలో మెంతులను కొన్ని రోజులు నానబెట్టండి. ఆ తర్వాత ఈ నూనెను వడకట్టి జుట్టుకు అప్లై చేస్తే సరిపోతుంది.
 

కొబ్బరినూనెలో ఆముదం నూనెను కలిపి పెడితే? 

ఆముదం నూనె కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొబ్బరి నూనెలో ఆముదం నూనెను మిక్స్ చేసి జుట్టుకు పెడితే ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

ఇది మీ జుట్టును పొడుగ్గా పెంచడమే కాకుండా.. మంచి మెరుపును కూడా ఇస్తుంది.ఇందుకోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనెను, ఆముదం నూనెను సమాన పరిమాణంలో తీసుకుని కలపండి. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి చల్లారిన తర్వాత జుట్టుకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి.

జుట్టును పెంచే ఇంటి చిట్కాలు

కలబంద రసం: కలబంద రసం కూడా మీ జుట్టును పెంచడానికి బాగా సహాయపడుతుంది. కలబందలో ఉండే పోషకాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అందుకే మనం ఉపయోగించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కలబంద రసం ఖచ్చితంగా ఉంటుంది.

దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్ కాంపోనెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు లేకుండా చేస్తాయి. అలాగే జుట్టు పెరగడానికి సహాయపడతాయి. 

ఉల్లిపాయ రసం: అవును ఉల్లిపాయ రసం కూడా హెయిర్ ఫాల్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. ఇది మన నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫేట్ మెండుగా ఉంటుంది.

ఇది పొట్టి జుట్టును పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. 

Latest Videos

click me!