ఈ 5 కారణాల వల్లే ఆడవాళ్లు వేగంగా బరువు పెరుగుతారు

First Published | Sep 4, 2024, 5:13 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మగవాళ్లకంటే ఆడవాళ్లే ఊబకాయం బారిన ఎక్కువగా పడుతున్నారు. అయితే ఆడవాళ్లు వేగంగా బరువు పెరగడానికి ఐదు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే? 

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, డైలీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఊబకాయం బారిన ఎక్కువగా పడుతున్నారు. ముఖ్యంగా ఆడవారే ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు.

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి మూడో వంతు ఆడవారు వేగంగా  బరువు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారో కూడా తెలియదు.

ఇంత ఫాస్ట్ గా బరువు ఎందుకు పెరుగుతున్నానని భయపడిపోతుంటారు. అయితే ఆడవారు వేగంగా బరువు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే? 
 

obesity

తప్పుడు ఆహారపు అలవాట్లు

తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఆడవాల్లు ఫాస్ట్ గా బరువు పెరిగిపోతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే ఆడవారు తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్లే వీరు ఎక్కువగా బరువు పెరిగిపోతుంటారు.

ముఖ్యంగా రాత్రిపూట వేయించిన ఆహారాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆడవారు బరువు పెరిగిపోవడమే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 


పెరిగిన ఒత్తిడి

ఆడవాళ్లు ఆఫీసుకు వెళ్లినా, గృహిణిగా ఉన్నా.. ఇంట్లో పనిభారం మాత్రం తప్పదు. నిజానికి ఆడవాళ్లకు ఎన్నో  బాధ్యతలు ఉంటాయి. దీని వల్ల వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. కానీ ఈ ఒత్తిడి వల్ల కూడా శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది.

ఎందుకంటే ఒత్తిడి వల్ల శరీరంలో 'కార్టిసాల్' హార్మోన్ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆడవారు ఖచ్చితంగా తమ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి చేయాలి. 

యాక్టివ్ గా లేకపోవడం

మీరు బరువు పెరగడానికి శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక కారణమే. రోజంతా ఒకే దగ్గర  కూర్చోవడం లేదా పడుకోవడం కూడా శరీరంలో ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. అయితే ఇంట్లో అన్ని పనులను చేస్తారు.

కానీ వేరే శారీరక శ్రమ మాత్రం చేయరు. దీనివల్ల బరువు పెరుగుతారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలంటే ఇంటి పనులు చేయడమే కాకుండా వ్యాయామం, యోగా, వాకింగ్ కూడా చేయాలి. 
 

తక్కువ నిద్ర

బరువు పెరగడానికి మరకొ కారణం నిద్రలేమి సమస్య. కంటినిండా నిద్రలేకపోవడం వల్ల కూడా మీరు బరువు పెరిగిపోతారు. నిజానికి నిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత మొదలవుతుంది. దీంతో మెటబాలిజం మందగిస్తుంది. ఆకలి పెరుగుతుంది. దీనివల్ల శరీర బరువు పెరుగుతుంది.
 

ఆరోగ్య సమస్యలు

పై కారణాలతో పాటుగా మీరు అకస్మత్తుగా బరువు పెరుగుతున్నారంటే  మీకు ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నట్టే. థైరాయిడ్ లేదా పీసీఓడీ సమస్యలు ఉంటే కూడా బరువు పెరుగుతారు.

దీనితో పాటుగా శరీరంలో హార్మోన్ల సమతుల్యత క్షీణించినప్పుడు కూడా బరువు మీరు ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. మీరు అకస్మత్తుగా బరువు పెరిగినా, తగ్గినా వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. 
 

Latest Videos

click me!