బ్లాక్ టీ, జొజోబా నూనె
బ్లాక్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా జుట్టును నల్లగా చేయడానికి, మంచి రంగును ఇవ్వడానికి బాగా సహాయపడతాయి. జొజోబా నూనె, స్కాల్ప్ సహజ నూనెలను పోలి ఉంటుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
ఈ కలయిక తెల్లబడిన జుట్టు రూపాన్ని మెరుగుపరుస్తుంది, పోషణను అందిస్తుంది. అలాగే పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె జుట్టును హెల్తీగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.