White Hair: 15 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చే బెస్ట్ చిట్కా ఇది..!
మనం నెరసిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకు లభించే కొన్నింటిని వాడి కూడా శాశ్వతంగా నల్లగా మార్చేయవచ్చు.
మనం నెరసిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకు లభించే కొన్నింటిని వాడి కూడా శాశ్వతంగా నల్లగా మార్చేయవచ్చు.
నేటి కాలంలో తెల్ల జుట్టు అనేది సాధారణ సమస్య అయిపోయింది.టీనేజ్ వయసు పిల్లల దగ్గర నుంచి 30 దాటిన వారి వరకు అందరికీ తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దాని వల్ల వయసు పైనబడినవారిలా కనిపిస్తూ ఉన్నామని ఫీలైపోతున్నారు. ఇక.. దానిని కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఆ కలర్స్ లో ఉండే కెమికల్స్ కారణంగా మిగిలిన జుట్టు కూడా కలర్ మారిపోతోంది. మరి, అలా కాకుండా.. మీ తెల్ల జుట్టును మీరు శాశ్వతంగా నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం నెరసిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకు లభించే కొన్నింటిని వాడి కూడా శాశ్వతంగా నల్లగా మార్చేయవచ్చు.
1.హోం రెమిడీ..
మీరు 50 గ్రాముల జామ ఆకుల పేస్ట్, 50 గ్రాముల హెన్నా పౌడర్, 50 నుండి 60 మి.లీ. నిమ్మరసం కలపాలి. ఈ పేస్ట్‌ను ఏడు నుండి ఎనిమిది రోజులు ఇనుప పాన్‌లో ఉంచాలి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాయడం వల్ల ఎలాంటి నష్టం జరగదు.ఈ మిశ్రమాన్ని మీరు జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు నల్లగా, సహజంగా మారుస్తుంది. దీనిని 30 నిమిషాల తర్వాత అలా వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తలస్నానానికి షియా బటర్ ని వాడటం ఉత్తమం. దీని వల్ల రెగ్యులర్ గా చేయడం వల్ల మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.
కరివేపాకు హెయిర్ మాస్క్
కరివేపాకులో జుట్టు సంబంధిత సమస్యలను తొలగించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, కరివేపాకులో సహజ మెలనిన్ వర్ణద్రవ్యం పుష్కలంగా ఉంటుంది, ఇది చిన్న వయసులోనే జుట్టు రాలడం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారికి, మీకు వేప ఆకు హెయిర్ మాస్క్ లేకపోతే, మూలికా దుకాణాలలో లభించే వేప ఆకులతో కూడిన సహజ నూనెతో మీ జుట్టును మసాజ్ చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.
దీన్ని ఎలా చేయాలి?
ముందుగా ఒక చిన్న స్టీల్ పాన్ తీసుకుని, అందులో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి, రెండు నిమిషాలు వేడి చేయండి.
నూనె వేడెక్కిన తర్వాత, కొన్ని ఎండిన వేప ఆకులను చూర్ణం చేసి, నూనెలో వేసి, కాసేపు వేడి చేయనివ్వండి. వేప, కరివేపాకు పొడి నల్లగా మారుతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపివేసి, నూనెను కొంత సమయం పాటు చల్లబరచండి. తర్వాత ఈ నూనెను తలకు, జుట్టు మూలాలకు సమానంగా అప్లై చేసి, రెండు చేతులతో బాగా మసాజ్ చేయండి.ఈ నూనెను మీ తలకు, జుట్టు అన్ని భాగాలకు సమానంగా అప్లై చేసి, ఐదు నిమిషాలు మసాజ్ చేయండి, తర్వాత హెయిర్ క్యాప్ ధరించండి. తర్వాత రాత్రంతా అలాగే ఉంచి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం, సహజ షాంపూ ఉపయోగించి మీ జుట్టును కడగాలి.
కాఫీ పౌడర్ హెయిర్ మాస్క్
మీరు కాఫీ పౌడర్ సహాయంతో మీ జుట్టుకు రంగు వేయవచ్చు. దీని కోసం, అర కప్పు కాఫీ పౌడర్ తీసుకొని కొంచెం నీటితో కలిపి మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు ఉంచి, ఆపై మీ జుట్టును ఎప్పటిలాగే కడగాలి. ఇలా చేయడం ద్వారా, తెల్ల జుట్టు కూడా నల్లగా మారడం ప్రారంభమవుతుంది.
బంగాళాదుంప తొక్కలను ఉపయోగించండి
మీరు మీ జుట్టును నల్లగా చేయడానికి బంగాళాదుంప తొక్కలను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నె బంగాళాదుంప తొక్కలను తీసుకొని వాటిని ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టండి.పేస్టులాగా మార్చిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది.
ఉల్లిపాయ రసం వాడండి
మంచి జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయను క్రమం తప్పకుండా వాడాలి. తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడటానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. దీని కోసం, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని సమాన మొత్తంలో నిమ్మరసంతో కలపండి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు , జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. దీని తర్వాత, మీ జుట్టును ఎప్పటిలాగే కడగాలి. మీరు వారానికి రెండుసార్లు ఇలా ఉపయోగిస్తే, మీ జుట్టు నల్లగా మారుతుంది.