మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

First Published | Jul 22, 2023, 9:40 AM IST

మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

మీరు మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నా.. లేదా ఇక నుంచి  సెక్స్ లో పాల్గొనాలనుకుంటున్నా.. మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఈ మార్పులు ఎలా ఉంటాయి? దీనివల్ల కూడా మార్పులు వస్తాయా? అని చాలా మంది అనుకుంటారు. అసలు సెక్స్ లో ఫస్ట్ టైం పాల్గొన్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నొప్పి ఉండొచ్చు

సెక్స్ సమయంలో నొప్పి రావడం చాలా సహజం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ సాధారణమైనవి. మీ హైమెన్ స్ట్రెచ్ నొప్పిని కలిగిస్తుంది. అలాగే లూబ్రికెంట్ లేకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది. లేదా యోని కండరాలు బిగుతుగా ఉండటం వల్ల కూడా నొప్పి రావొచ్చు. సెక్స్ సమయంలో ఆందోళన కూడా నొప్పికి కారణమవుతుంది. ప్రారంభంలో చాలాసార్లు సెక్స్ సమయంలో ఉద్వేగం వచ్చినప్పుడు గర్భాశయంలో తిమ్మిరి ప్రారంభమవుతుంది. సెక్స్ సమయంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది గర్భాశయంలో సంక్రమణ కారణంగా నొప్పిని కలిగిస్తుంది. 
 


రక్తస్రావం

మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి రక్తం రాకపోవచ్చు. ఈ రెండూ సర్వ సాధారణమైనవి. మొదటిసారి సెక్స్ తర్వాత రక్తస్రావం జరిగితే దానికి కారణం హైమెన్. హైమెన్ అనేది సన్నని చర్మ పొర. ఇది మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు సాగదీయబడుతుంది. లేదా చిరిగిపోతుంది. దీనివల్ రక్తస్రావం అవుతుంది. నిజానికి హైమెన్ చాలా సులభంగా సాగగలదు. అలాగే చిరిగిపోగలదు. అయతే ఇది చిరిగిపోవడానికి సెక్స్ మాత్రమే కారణం కాదన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. గేమ్స్ వల్ల కడా హైమెన్ చిరిగిపోతుంది. టాంపోన్ల వాడకం కూడా హైమెన్ ను విచ్ఛిన్నం చేస్తుంది. మీ కన్యత్వానికి హైమెన్ కు ఎలాంటి సంబంధం లేదు. సెక్స్ సమయంలో హైమెన్ చిరిగిపోవడం వల్ల వచ్చే రక్తం ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది.
 

మూత్ర విసర్జన సమయంలో మంట

సెక్స్ తర్వాత బాత్ రూం కు వెళ్లినప్పుడు మంటగా అనిపించడం మామూలే. యోని, మూత్రాశయం చాలా దగ్గరగా ఉంటాయి.కాబట్టి యోనిపై ఒత్తిడి పడి మూత్రాశయంలో నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి రెండు మూడు రోజులకు మించి ఉంటే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకూడదు. 
 

యోనిలో దురద 

యోనిలో తేలికపాటి దురద సాధారణం. కానీ ఈ దురద ఎక్కువగా ఉంటే అది కండోమ్లకు అలెర్జీ వల్ల కావొచ్చంటున్నారు నిపుణులు. మీరు లూబ్రికెంట్ ను ఉపయోగించినట్టైతే అది కూడా అలెర్జీకి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు.
 

యూటీఐ ఉండొచ్చు

సెక్స్ సమయంలో మీ భాగస్వామి ద్వారా బ్యాక్టీరియా మీ యోని,  మూత్రాశయానికి చేరుకుంటుంది. ఇది యూటీఐలకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఇది దురద, చికాకుకును కూడా కలిగిస్తుంది. 
 

మీ చనుమొనలు, క్లిటోరిస్ పరిమాణం మారొచ్చు

మొదటిసారి సెక్స్ లో పాల్గొనప్పుడు మీ చనుమొనలలో కూడా మార్పు వస్తుంది. దీనివల్ల మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు చనుమొనలు మారుతాయి. ఇది మీ రొమ్ము కణజాలం ఉబ్బడానికి కారణమవుతుంది. అలాగే రొమ్ములు పెద్దవిగా కనిపించడం ప్రారంభిస్తాయి. అంతే కాదు మీరు లైంగికంగా ప్రేరేపించబడినప్పుడు మీ చనుమొనలు బిగుతుగా మారుతాయి. అలాగే ఇది క్లిటోరిస్ పరిమాణాన్ని పెంచుతుంది. అయితే సెక్స్ తర్వాత ఇది సాధారణ పరిమాణానికి తిరిగి వస్తుంది.
 

సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి

శృంగారంలో పాల్గొంటే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. అంతే కాదు ప్రేరేపించబడినప్పుడు చనుమొన, క్లిటోరిస్ కండరాలలో ఉద్రిక్తత ఉంటుంది. సెక్స్ సమయంలో భావప్రాప్తిని పొందుతారు. వీటన్నింటికీ కారణం సెక్స్ వల్ల మెదడులో ఆక్సిటోసిన్ స్థాయి పెరగడమే.
 

యోని స్థితిస్థాపకత మారుతుంది

మీ యోని కండరాలు చాలా స్థితిస్థాపకంగా ఉంటాయి. అలాగే ఈ స్థితిస్థాపకత మారుతూ ఉంటుంది. సెక్స్ తర్వాత మీ యోని చాలావరకు తెరుచుకుంటుంది. ఇది సాధారణం.

Latest Videos

click me!